RCB IPL Auction 2025: కోహ్లీ టీమ్‌ను చూశారా? అందరూ ధనాధన్ ప్లేయర్లే.. ఈసారైనా కప్ కొట్టేనా?

|

Nov 25, 2024 | 7:44 PM

Royal Challengers Bengaluru IPL Auction Players : స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ కొట్టలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎప్పటిలాగే ఈసారి కూడా బోలెడన్నీ ఆశలతో ఆ జట్టు ఐపీఎల్ లోకి బరిలోకి దిగుతోంది. అందుకు తగ్గట్టే ఆటగాళ్ల ఎంపికలోనూ జాగ్రత్త పడుతోంది.

RCB IPL Auction 2025: కోహ్లీ టీమ్‌ను చూశారా? అందరూ ధనాధన్ ప్లేయర్లే.. ఈసారైనా కప్ కొట్టేనా?
RCB IPL Auction
Follow us on

ఐపీఎల్ మెగా వేలంలో నిఖార్సయిన టీ20 స్పెషలిస్టులను ఎంపిక చేసుకుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో మెరుపులు మెరిపించే ప్లేయర్లకే పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం ఎన్ని కోట్లైనా కుమ్మరిస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం రండి. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రసిక్ ధారా (అన్ క్యాప్డ్ ప్లేయర్), కృనాల్ పాండ్యా వంటి ధనాధన్ బ్యాటర్లు ఉండగా.. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, స్వప్నిల్ సింగ్ వంటి స్టార్ బౌలర్లు జట్టులో చేరారు.

మెగా వేలానికి ముందు RCB నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా:

  • విరాట్ కోహ్లీ -రూ. 21 కోట్లు),
  • రజత్ పటీదార్ -రూ. 11 కోట్లు
  • యశ్ దయాల్ -రూ. 5 కోట్లు

మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ఆటగాళ్లు వీరే..

  • లివింగ్‌స్టోన్- రూ. 8.75 కోట్లు
  • ఫిల్ సాల్ట్- రూ. 11.50 కోట్లు
  • జితేష్ శర్మ- రూ. 11 కోట్లు
  • జోష్ హేజిల్‌వుడ్- రూ. 12.50 కోట్లు,
  • రసిఖ్ దార్- రూ. 6 కోట్లు,
  • సుయాష్ శర్మ- రూ. 2.60 కోట్లు,
  • కృనాల్ పాండ్యా- రూ. 5.75 కోట్లు,
  • భువనేశ్వర్ కుమార్- రూ. 10.75 కోట్లు,
  • స్వప్నిల్ సింగ్- రూ. 50 లక్షలు,
  • టిమ్ డేవిడ్ -రూ. 3 కోట్లు,
  • రొమారియో షెపర్డ్- రూ. 1.50 కోట్లు,
  • నువాన్ తుషార -రూ. 1.60 కోట్లు.

ఆర్సీబీ వద్ద ఇంకా ఎంత డబ్బు ఉందంటే?

  • RCB వద్ద మిగిలి ఉన్నపర్స్ మనీ: రూ. 7.55 కోట్లు
  • RTM కార్డ్‌లు ఎడమవైపు: 2
  • మిగిలిన ప్లేయర్ల స్లాట్స్: 10
  • ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్స్: 2

గమనిక: ఐపీఎల్ వేలం రెండో రోజు జరుగుతోంది. కాబట్టి, పూర్తి స్వ్కాడ్‌ను త్వరలోనే అప్ డేట్ చేసి అందిస్తాం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..