Video: జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న సీనియర్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?

RCB Appoints Rajat Patidar IPL Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2024 సీజన్‌కు రజత్ పాటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ తర్వాత ఈ బాధ్యతను అందుకున్న రజత్, మధ్యప్రదేశ్‌కు T20 మరియు ODI టోర్నమెంట్లలో నాయకత్వం వహించిన అనుభవం కలిగి ఉన్నాడు. కోహ్లీ రజత్‌ను అభినందించగా, ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి ఈ మార్పు సహాయపడుతుందని ఆశిస్తుంది.

Video: జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న సీనియర్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
Virat Kohli Rcb Captain

Updated on: Feb 13, 2025 | 1:57 PM

RCB Appoints Rajat Patidar IPL Captain: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గురువారం మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రాబోయే సీజన్‌కు రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. గత సంవత్సరం మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిలుపుకున్న ఆటగాళ్లలో రజత్ పాటిదార్ కూడా ఉన్నాడుజ. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (T20), విజయ్ హజారే ట్రోఫీ (ODI)లలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించిన అనుభవం అతనికి ఉంది.

RCB కొత్త కెప్టెన్ ఎవరు?

31 ఏళ్ల రజత్ పాటిదార్ 2022 సంవత్సరంలో ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో, మధ్యప్రదేశ్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. గత సంవత్సరం ముంబై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో అజింక్య రహానే తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అతను 10 మ్యాచ్‌ల్లో 61 సగటు, 186.08 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

జూనియర్ క్రికెటర్ కెప్టెన్సీలో ఆడనున్న కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రకటనకు ముందు, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి వస్తాడని ఊహాగానాలు వచ్చాయి. విరాట్ కోహ్లీ 2013 నుంచి 2021 వరకు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని రికార్డు అద్భుతంగా ఉంది. కానీ, అతని నాయకత్వంలో జట్టు టైటిల్ గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి నాయకత్వం వహించాడు. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు లెజెండరీ మహేంద్ర సింగ్ ధోని తర్వాత రెండవ అత్యధిక కాలం కెప్టెన్‌గా పనిచేశాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పుడు తనకంటే 5 సంవత్సరాలు చిన్నవాడైన క్రికెటర్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.

కోహ్లీ స్పందన ఏంటంటే?

రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించినందుకు విరాట్ కోహ్లీ అభినందించాడు. ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియో స్టేట్‌మెంట్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘నేను, జట్టులోని ఇతర సభ్యులు కొత్త కెప్టెన్‌తోనే ఉన్నాం. ఈ ఫ్రాంచైజీలో రజత్ సాధించిన పురోగతి, ప్రదర్శించిన తీరుతో ఆర్‌సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. నువ్వు దానికి అర్హుడివి అంటూ’ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ట్రోఫీ రుచి ఎరుగని ఆర్‌సీబీ..

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభమవుతుంది. గురువారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ప్రకటన చేసింది. జట్టు డైరెక్టర్‌తో పాటు, ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, రజత్ పాటిదార్ హాజరయ్యారు. RCB ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేసి, “చాలా మంది గొప్ప ఆటగాళ్ళు RCB కి గొప్ప కెప్టెన్సీ వారసత్వాన్ని అందించారు” అంటూ పోస్ట్ చేశారు. మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, ఆర్‌సీబీ ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ గెలవడానికి దూరంగానే నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..