AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియా వామప్‌ మ్యాచ్‌లు ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు. నేరుగా టోర్నీ ఆడనుంది. మరి టీమిండియా ఈ నిర్ణయం ఎందకు తీసుకుంది? డైరెక్టుగా టోర్నీలో మెయిన్ మ్యాచ్ లు ఆడితే ఇబ్బంది కాదా అనే అభిమానుల డౌట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు టీమిండియా వామప్‌ మ్యాచ్‌లు ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!
Team India
SN Pasha
|

Updated on: Feb 13, 2025 | 2:08 PM

Share

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ను 3-0తో మట్టి కరిపించిన రోహిత్‌ సేన ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ బరిలోకి దిగనుంది. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్‌, యూఏఈ వేదిక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కాగా, ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మినహా అన్ని జట్లు ప్రాక్టీస్‌, వామప్‌ మ్యాచ్‌లు ఆడతుండగా, టీమిండియా మాత్రం నేరుగా మెయిన్‌ మ్యాచ్‌తోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ వేటను కొనసాగించనుంది. వామప్‌ మ్యాచ్‌లు లేకుండా భారత జట్టు డైరెక్ట్‌గా ప్రధాన టోర్నీకి వెళ్తుండటంపై భారత క్రికెట్‌ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీమిండియా ఎలాంటి వామప్‌ మ్యాచ్‌లు అవసరం లేదని బీసీసీఐనే చెప్పినట్లు సమాచారం. దీన్ని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అనుకోకండి. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12, బుధవారం నాడే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం వేదికగా చివరి వన్డే ముగిసింది. ఈ నెల 15న అంటే శనివారం భారత జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం యూఏఈ కి బయలు దేరి వెళ్లనుంది. ఆ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. సో.. ఇంత టైట్‌ షెడ్యూల్‌లో వామప్‌ మ్యాచ్‌లు ఆడితే, ఆటగాళ్లు శారీరకంగా అలసిపోయే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది.

అందుకే వామప్‌ మ్యాచ్‌లు అవసరం లేదని బీసీసీఐ.. ఐసీసీకి సూచించింది. ఎలాగో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మంచి ప్రదర్శన కనబర్చింది. గత కొన్ని రోజులుగా సరైన ఫామ్‌లో లేని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో బీసీసీఐ కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీపై నమ్మకం పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో కటక్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అలాగే అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డేలో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. మొత్తానికి ఈ ఇద్దరు దిగ్గజాలు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. వీరితో పాటు శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ అంతా మంచి ఫామ్‌లో ఉండటంతో ఇక వామప్‌ మ్యాచ్‌లు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉందని బీసీసీఐ భావించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..