Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం?

|

Dec 13, 2022 | 2:10 PM

Rawalpindi Pitch: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ పెద్ద షాకిచ్చింది. రావల్పిండ్ పిచ్‌కు ఐసీసీ సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది.

Pakistan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం?
Rawalpindi Pitch Pak Vs Eng
Follow us on

ICC on Rawalpindi Pitch: ఈ రోజుల్లో ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రావల్పిండిలోని ఈ పిచ్ గురించి రకరకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా స్వయంగా ఈ పిచ్‌ను ‘ఇబ్బందికరమైనది’ గా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ పిచ్‌కి రెండోసారి ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఇబ్బందుల్లోకి నెట్టింది.

రావల్పిండిలో ప్రశ్నార్థకంగా అంతర్జాతీయ క్రికెట్?

ఈ రావల్ పిచ్‌కి ఐసీసీ రెండోసారి డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా ఈ పిచ్‌కి ఐసీసీ డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఐసీసీ నుంచి వరుసగా రెండుసార్లు డీమెరిట్ పాయింట్లు పొందడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ముప్పుగా పరిణమించవచ్చు. ఈ డీమెరిట్ పాయింట్ ఐదుకి చేరితే, ఈ మైదానం అంతర్జాతీయ క్రికెట్‌లో 12 నెలల పాటు ఐసీసీ నుంచి నిషేధానికి గురికావొచ్చు.

ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్‌కు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ పిచ్ గురించి మాట్లాడుతూ, “ఇది చాలా ఫ్లాట్ పిచ్, ఇది ఏ రకమైన బౌలర్‌కు ఎలాంటి సహాయం అందించలేదు. బ్యాట్స్‌మెన్‌లు చాలా వేగంగా స్కోరు చేయడంతోపాటు ఇరు జట్లు భారీ స్కోరు సాధించడానికి ఇదే ప్రధాన కారణం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్ ఏమాత్రం క్షీణించలేదు. బౌలర్లకు తక్కువ సహాయం ఉంది. కాబట్టి ICC మార్గదర్శకాల ప్రకారం సరైన పిచ్ కాదు, సగటు కంటే తక్కువగా’ ఉందని నేను గుర్తించాను అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

రావల్పిండిలో రికార్డు స్కోరు..

పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో రికార్డు స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్స్ దూకుడు ప్రదర్శించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం స్కోరు 1768 పరుగులు. టెస్టు క్రికెట్‌లో ఇది మూడో అత్యధిక స్కోరుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..