BCCI: జడేజా రాక్స్.. రాహుల్ షాక్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్‌లో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే.?

భారత పురుషుల జట్టుకు సెంట్రల్ కాంట్రాక్ట్స్ గ్రేడ్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. వార్షిక జాబితాలోని 4 గ్రేడ్స్‌లో మొత్తం 26 మంది ఆటగాళ్లకు.. ఇందులో రాహుల్‌ కిందకు పడిపోగా. జడేజాకు ప్రమోషన్, శాంసన్‌కు తొలిసారి కాంట్రాక్టు దక్కింది.

BCCI: జడేజా రాక్స్.. రాహుల్ షాక్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్‌లో ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే.?
Bcci Contracts List
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 27, 2023 | 11:05 AM

భారత పురుషుల జట్టుకు సెంట్రల్ కాంట్రాక్ట్స్ గ్రేడ్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. వార్షిక జాబితాలోని 4 గ్రేడ్స్‌లో మొత్తం 26 మంది ఆటగాళ్లకు చోటు దక్కాయి. గాయం నుంచి రీ-ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆదరగొట్టడంతో.. అతడికి ఏ నుంచి ఏ+ గ్రేడ్‌కు ప్రమోషన్ లభించింది. ఇక కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కెఎల్ రాహుల్ ఏ నుంచి బీకి పడిపోయాడు. అలాగే సీనియర్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహనే, భువనేశ్వర్ కుమార్ పేర్లను కాంట్రాక్ట్స్ జాబితా నుంచి తొలగించింది బీసీసీఐ.

ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా బీసీసీఐ 4 కేటగిరీల్లో ఈ వార్షిక కాంట్రాక్టులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఏ+ కేటగిరీకి ఏటా రూ.7 కోట్లు, ఆ తర్వాత A కేటగిరీ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌కి రూ.3 కోట్లు, సీ గ్రేడ్‌ ప్లేయర్స్‌కి రూ. 1 కోటి లభిస్తాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా ఏ ప్లస్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. వారితో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈసారి ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, మహమ్మద్ షమీ ఏ కేటగిరీలో కొనసాగుతుండగా.. కొత్తగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇందులోకి వచ్చారు. ఇంతకముందు హార్దిక్ సి, అక్షర్ పటేల్ బీలో ఉన్నారు. అదే సమయంలో రాహుల్‌తో పాటు పుజారా, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ బీలో ఉన్నారు.

ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, కెఎస్ భరత్‌ కూడా సి కేటగిరిలో ఉన్నారు. అనూహ్యంగా అజింక్యా రహనే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హనుమ విహారి, వృద్దిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహార్ కాంట్రాక్ట్స్‌ జాబితాలో చోటు కోల్పోయారు.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..