MLC 2024: 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు.. టీ20 మాన్‌స్టర్‌లు ఈ ప్లేయర్స్.. ఎవరో తెలుసా.?

|

Jul 28, 2024 | 1:46 PM

మేజర్ లీగ్ క్రికెట్ 2024 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్స్ ఊచకోత కోశారు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పి.. తమ జట్టు అద్భుత విజయాన్ని అందించారు. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరని అనుకుంటున్నారా.? వారెవరో కాదు..

MLC 2024: 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు.. టీ20 మాన్‌స్టర్‌లు ఈ ప్లేయర్స్.. ఎవరో తెలుసా.?
Mlc 2024
Follow us on

మేజర్ లీగ్ క్రికెట్ 2024 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్స్ ఊచకోత కోశారు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పి.. తమ జట్టు అద్భుత విజయాన్ని అందించారు. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరని అనుకుంటున్నారా.? వారెవరో కాదు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్. వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున ఆడుతోన్న ఈ ఇద్దరు కీలక మ్యాచ్‌లో పేలుడు ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో హాసన్ ఖాన్(57), ఆండర్సన్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లు తీయగా.. జాన్సన్ 3 వికెట్లు, నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఇక 149 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌కి ఓపెనర్ ట్రావిస్ హెడ్(77) మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. అయితే అటు వరుసగా వికెట్లు పతనం అవుతుండటంతో వాషింగ్టన్ ఫ్రీడమ్‌ తొలి ఆరు ఓవర్లలోనే కష్టాల్లో పడింది. కానీ ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్(54), ట్రావిస్ హెడ్‌(77)తో కలిసి మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. ఇద్దరు కూడా అర్ధ సెంచరీలతో రాణించి.. టార్గెట్‌ను కేవలం 15 ఓవర్లలోనే చేధించారు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేయగా.. మ్యాక్స్‌వెల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. కాగా, డల్లాస్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..