నేడు MCG లో జరిగిన 4వ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెత్త పదర్శన చేశారు. దీంతో విరాట్, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. కోహ్లీ ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోనే అవకాశం లేదని, 3-4 ఏండ్లు ఇంకా కొనసాగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ ఈ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది తన అభిప్రాయమని, మునుపటిలా రోహిత్ ఫుట్ వర్క్ లేదని, బాల్‌ను షాట్ ఆడడంలో లేట్ అవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
బాక్సింగ్ డే మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌పై 184 పరుగుల తేడాతో గెలిచింది. 340 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు ఆలౌటైంది. మెల్‌బోర్న్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వెళదామని అని అనుకున్నా భారత్ ఆశలు అవిరి అయిపోయాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా-474, రెండో ఇన్నింగ్స్‌లో 234, భారత్-1వ ఇన్నింగ్స్‌లో 369, రెండో ఇన్నింగ్స్‌లో 155, 340 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 40 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసిన రోహిత్‌ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కె.ఎల్. రాహుల్ సున్నాకి అవుటయ్యాడు.
9 బంతుల్లో ఐదు పరుగులు చేసిన విరాట్ వెనుదిరుగాడు. 104 బంతుల్లో 30 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను ట్రావిస్ హెడ్ అవుట్ చేశాడు. అతని తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా వచ్చినట్లే వెనుదిరిగాడు. జడేజా 14 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి రెండో ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించలేకపోయాడు. నితీష్ ఐదు బంతుల్లో ఒక పరుగు చేసి నాథన్ లియాన్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత జైస్వాల్ 208 బంతుల్లో 94 పరుగులు చేశాడు. అయితే అనుహ్యంగా జైస్వాల్ కూడా ఔటైయ్యాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో జైస్వాల్, పంత్ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును దాటలేకపోయారు. పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో మూడు వికెట్లు, నాథన్ లియాన్ రెండు వికెట్లు, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జనవరి 3న సిడ్నీలో ప్రారంభం కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి