MS Dhoni Helicopter Shot: ఇంగ్లీష్ టీ20లో ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్..! ఆశ్చర్యపోతున్నారా.. ఎవరు కొట్టారో తెలుసా?

|

Aug 25, 2021 | 12:19 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్‌ను ఈ ప్లేయర్ కాపీ చేయడం ఇదే మొదటిసారి కాదు. జులైలో హాంప్‌షైర్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లోనూ అతను ఈ షాట్‌ను ప్రయత్నించాడు.

MS Dhoni Helicopter Shot: ఇంగ్లీష్ టీ20లో ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్..! ఆశ్చర్యపోతున్నారా.. ఎవరు కొట్టారో తెలుసా?
Rashid Khan Helicopter Shot
Follow us on

MS Dhoni Helicopter Shot: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ నిన్న రాత్రి ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్‌లో ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్‌ను ఆడాడు. దీంతో ధోని అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను ఈసీబీ తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకుంది. అసలు విషయానికి వస్తే.. రషీద్ చెస్టర్-లీ స్ట్రీట్‌లో జరిగిన టీ 20 బ్లాస్ట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడానికి తన జట్టు సస్సెక్స్‌కు సహాయపడ్డాడు. కేవలం తొమ్మిది బంతుల్లో 27 పరుగులు బాదేశాడు. 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన యార్క్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచుల్లో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అయితే, రషీద్ ఖాన్.. ఎంఎస్ ధోనీని కాపీ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది జులైలో, ఇదే టోర్నమెంట్‌లో, హాంప్‌షైర్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో అతను ఈ షాట్‌ను ఆడాడు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని బీబీఎల్ లాంటి ఇతర టీ20 లీగ్‌లలో చాలాసార్లు కూడా ఇలాంటి షాట్‌ను ఆడాడు.

మరోవైపు తాలిబన్ల చెరలో చిక్కకున్న తన దేశాన్ని రక్షించాలంటూ సోషల్ మీడియాలో రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. హింస పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశాన్ని విడిచి వెళ్లొద్దని ప్రపంచ నాయకులను కోరుతూ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి కోసం అంతా ముందుకురావాలంటూ సోషల్ మీడియాలో కోరాడు.

‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు అమరులవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. ఆఫ్ఘన్లను చంపడం, ఆఫ్ఘనిస్తాన్‌ను నాశనం చేయడం ఇకనైనా ఆపండి. మాకు శాంతి కావాలి’ అంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాడు.

Also Read: IND vs ENG 3rd Test Preview: జోరుమీదున్న టీమిండియా.. గెలిచేందుకు ఇంగ్లండ్ ఆరాటం.. నేటినుంచి హెడింగ్లీలో మూడో టెస్టు

19 ఏళ్ల వయసులోనే 20 సిక్సర్లు.. 30 ఫోర్లు బాదాడు..! అతడి ధాటికి బౌలర్లు విలవిలలాడిపోయారు..

ఆ మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టాడు.. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.. భారత్‌కి బలమైన విజయాన్ని అందించాడు..

మద్యం సేవించి బ్యాటింగ్ చేశాడు.. అదరగొట్టే సెంచరీతో అజేయంగా నిలిచాడు.. చరిత్ర సృష్టించాడు..