Ranji Trophy: ఆనాడు బ్యాట్‌తో 241 పరుగుల కీలక ఇన్నింగ్స్.. నేడు బౌలింగ్‌లో 7 వికెట్లతో దుమ్మురేపిన ఆల్ రౌండర్..

2022-23 రంజీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్ పుదుచ్చేరిని కేవలం 37 పరుగులకే ఆలౌట్ చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అజయ్ మండల్ 7 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

Ranji Trophy: ఆనాడు బ్యాట్‌తో 241 పరుగుల కీలక ఇన్నింగ్స్.. నేడు బౌలింగ్‌లో 7 వికెట్లతో దుమ్మురేపిన ఆల్ రౌండర్..
Ranji Trophy 2022 Ajay Mandal

Updated on: Dec 14, 2022 | 12:30 PM

రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌లో ఓ వైపు కేరళ, గోవా, హైదరాబాద్ జట్లు మంచి బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ల కారణంగా కొన్ని జట్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 37 పరుగులకే కుప్పకూలిన పుదుచ్చేరి జట్టు విషయంలో కూడా అలాంటిదే జరిగింది. పుదుచ్చేరి జట్టు కేవలం 23.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఛత్తీస్‌గఢ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు మాత్రమే చేసింది. అయితే పుదుచ్చేరి పేలవమైన ఆటతీరును అధిగమించలేకపోయింది.

పుదుచ్చేరి జట్టు మొత్తం చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు బౌలర్ల చేలితో కుప్పకూలింది. సుమిత్ రుయికర్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ఎడమచేతి వాటం స్పిన్నర్ అజయ్ మండల్ 7 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. పుదుచ్చేరిపై అజయ్ మండల్ 11.2 ఓవర్లలో 6 మెయిడిన్లు వేశాడు. పుదుచ్చేరి బ్యాటింగ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అందులో 6 మంది బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. అంకిత్ శర్మ 15 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. నయన్ కాంగ్యాన్ 12 పరుగులు చేశాడు. మరే ఇతర బ్యాట్స్‌మెన్ డబుల్ ఫిగర్‌ను టచ్ చేయలేకపోయారు.

బ్యాట్‌తో రెచ్చిపోయిన అజయ్ మండల్..

అజయ్ మండల్ తన బ్యాటింగ్ కారణంగా 2019 సంవత్సరంలో చర్చల్లోకి వచ్చాడు. మండల్ ఉత్తరాఖండ్‌పై 8వ స్థానంలో దిగి డబుల్ సెంచరీ కొట్టాడు. అమన్‌దీప్ ఖరేతో కలిసి మండల్ 7వ వికెట్‌కు 399 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మండల్ 301 బంతుల్లో అజేయంగా 241 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి 2 సిక్సర్లు, 35 ఫోర్లు ఉన్నాయి. 8వ స్థానంలో దిగి అతిపెద్ద రంజీ ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్ మండల్ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

అజయ్ మండల్ ఫస్ట్ క్లాస్ రికార్డ్ అద్భుతం..

అజయ్ మండల్ ఇప్పటివరకు 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 39 సగటుతో 1049 పరుగులు సాధించాడని మీకు తెలియజేద్దాండు. ఈ ఆటగాడు 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. బౌలింగ్‌లోనూ అజయ్‌ మండల్‌ 68 వికెట్లు తీశాడు. పుదుచ్చేరిపై కేవలం 7 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి, ఈ రంజీ సీజన్‌లో సందడి చేసేందుకు ఈ ఆటగాడు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..