RR vs RCB Toss Update: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరంటే?

RR vs RCB Toss Update: ఐపీఎల్‌లో 16వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది. బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వేసిన వెంటనే గౌహతిలో వర్షం మొదలైంది. ఈ మ్యాచ్ రాత్రి 8:15 గంటలకు ప్రారంభం కానుంది. 

RR vs RCB Toss Update: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరంటే?
Rr Vs Rcb Ipl 2026

Updated on: Apr 10, 2026 | 8:21 PM

ఐపీఎల్‌లో 16వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతోంది. బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ వేసిన వెంటనే గౌహతిలో వర్షం మొదలైంది. ఈ మ్యాచ్ రాత్రి 8:15 గంటలకు ప్రారంభం కానుంది. 

తుషార్ దేశ్‌పాండేకు విశ్రాంతినిచ్చినట్లు కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రకటించాడు. అతని స్థానంలో బ్రిజేష్‌కు అవకాశం ఇచ్చాడు. జాకబ్ డఫీ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ బెంగళూరుకు తిరిగి వచ్చాడు.

తమ తొలి మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. వారు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందారు. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండు విజయాలు సాధించింది.

ఇరు జట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.

Follow Us