రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో వేలం సమయంలో తక్కువ బడ్జెట్‌తో రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కొంతమంది నాసిరకం ఆటగాళ్లను ఎంపిక చేయడానికి దారి తీసింది. జట్టు కొంతమందిని మంచి ఆటగాళ్లతో నింపినా, జట్టు ఇప్పటికీ కొన్ని ప్రధాన బలహీనతలతో ఉంది.
బ్యాటింగ్ విభాగంలో బ్యాకప్‌లు లేకపోవడం ప్రధాన సమస్య. ఫస్ట్-చాయిస్ బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సరైన బ్యాటర్లు లేకపోవడం జట్టులో గాయాలు అయినా లేదా ఏ బ్యాటర్ అయిన ఫామ్ కోల్పోయే సందర్భం వస్తే పెద్ద సమస్యగా మారవచ్చు.
మరో ముఖ్యమైన అంశం జట్టులో నికార్సైన ఆల్-రౌండర్ లేకపోవడం. ఆల్-రౌండర్ల విలువ కొంత తగ్గినా, జట్టును సమతుల్యం చేయగల ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది.
విదేశీ బౌలర్ల విషయంలో జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా ఇద్దరు అద్భుతమైన ప్రతిభ కలిగినవారైనా, గాయాల సమస్యలతో వీరు ఎప్పుడైనా అందుబాటులో ఉనకపోవచ్చు. వీరి గైర్హాజరీ జట్టు బౌలింగ్‌ను బలహీనపరుస్తుంది. ఈ మూడు ప్రధాన సమస్యలను రాజస్థాన్ రాయల్స్ పరిష్కరించగలిగితేనే వారు సీజన్‌లో విజయవంతం అవుతారు.