RR vs GT, IPL 2024: రాజస్థాన్‌కు షాక్.. థ్రిల్లింగ్ పోరులో చివరి బంతికి విజయం సాధించిన గుజరాత్

Rajasthan Royals vs Gujarat Titans: హోం గ్రౌండ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ లో అపజయమెరుగని ఆ జట్టుకు గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమి రుచి చూపించింది. బుధవారం (ఏప్రిల్ 10) రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ పోరులో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది.

RR vs GT, IPL 2024: రాజస్థాన్‌కు షాక్.. థ్రిల్లింగ్ పోరులో చివరి బంతికి విజయం సాధించిన గుజరాత్
Rajasthan Royals vs Gujarat Titans
Follow us

|

Updated on: Apr 11, 2024 | 12:08 AM

Rajasthan Royals vs Gujarat Titans: హోం గ్రౌండ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ లో అపజయమెరుగని ఆ జట్టుకు గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమి రుచి చూపించింది. బుధవారం (ఏప్రిల్ 10) రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ పోరులో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని గిల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. గుజరాత్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు కావాలి. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌండరీ కొట్టి టైటాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (72) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా… చివర్లో తెవాతియా (22), రషీద్‌ ఖాన్‌ (11 బంతుల్లో 24 నాటౌట్, 4 ఫోర్లు ) చెలరేగి ఆడి గుజరాత్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. రాజస్థాన్‌ బౌలర్లలో కుల్దీప్‌ సేన్‌ 3, చాహల్‌ 2 వికెట్లు తీశారు. కాగా ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి ఓటమి.

కాగా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ నిర్ణయాన్ని రాజస్థాన్ సద్వినియోగం చేసుకుంది.ఆరంభ ఓవర్లలో భారీగానే పరుగులు సాధించింది. అయితే యశస్వి జైస్వాల్ 24, జోస్ బట్లర్ 8 పరుగుల వద్ద ఔటయ్యారు. దీంతో రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్‌ సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌ ఇద్దరూ గుజరాత్‌ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. . వీరిద్దరు మూడో వికెట్‌కు 83 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. షిమ్రాన్ 13 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. కాగా, గుజరాత్‌లో మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్ తలో వికెట్ కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్స్:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కోటియన్, శుభమ్ దూబే, కేశవ్ మహారాజ్, నవదీప్ సైనీ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (సి), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (w), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్:

శరత్ BR, షారుఖ్ ఖాన్, దర్శన్ నల్కండే, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మానవ్ సుతార్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు