కోల్‌కతాపై చెన్నై విజయం

| Edited By:

Apr 15, 2019 | 6:23 AM

ఐపిఎల్‌లో భాగంగా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో దూసుకెళ్తున్న ధోనీ సేన లీగ్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తాహిర్‌ (4/27) బంతితో మ్యాజిక్‌ చేయగా.. ఛేదనలో రైనా (42 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్‌) అర్ధ శతకంతో రాణించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఓడించింది. 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు […]

కోల్‌కతాపై చెన్నై విజయం
Follow us on

ఐపిఎల్‌లో భాగంగా ఆల్‌రౌండ్‌ ప్రతిభతో దూసుకెళ్తున్న ధోనీ సేన లీగ్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తాహిర్‌ (4/27) బంతితో మ్యాజిక్‌ చేయగా.. ఛేదనలో రైనా (42 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్‌) అర్ధ శతకంతో రాణించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఓడించింది. 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జడేజా (17 బంతుల్లో 5 ఫోర్లతో 31 నాటౌట్‌) సత్తాచాటగా.. నరైన్‌ (2/19) రెండు వికెట్లు పడ గొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లిన్‌ (51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 82) చెలరేగినా సహచరుల నుంచి తగిన సహకారం లభించలేదు. కాగా, 2013 తర్వాత ఈడెన్‌ గార్డెన్స్‌లో చెన్నైకు ఇదే తొలి గెలుపు.