హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్..సెంచరీకి చేరువలో రోహిత్

| Edited By: Pardhasaradhi Peri

Jul 02, 2019 | 6:27 PM

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(63)  హాప్ సెంచరీ పూర్తిచేసి సెంచరీ దిశగా వెళ్తున్నాడు. రుబేల్‌ బౌలింగ్‌లో రెండో బంతిని మిడ్‌ వికెట్‌ మీదుగా తరలించి రెండు పరుగులు రాబట్టి.. రాహుల్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా ఇండియా 158 పరుగులు చేసింది. రోహిత్(91), రాహుల్(63) జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు అదిరిపోయే ఫామ్‌లో ఉన్న భారత వైస్ కెప్టెన్ రోహిత్ సెంచరీ […]

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రాహుల్..సెంచరీకి చేరువలో రోహిత్
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌(63)  హాప్ సెంచరీ పూర్తిచేసి సెంచరీ దిశగా వెళ్తున్నాడు. రుబేల్‌ బౌలింగ్‌లో రెండో బంతిని మిడ్‌ వికెట్‌ మీదుగా తరలించి రెండు పరుగులు రాబట్టి.. రాహుల్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా ఇండియా 158 పరుగులు చేసింది. రోహిత్(91), రాహుల్(63) జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు అదిరిపోయే ఫామ్‌లో ఉన్న భారత వైస్ కెప్టెన్ రోహిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.