ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. కొత్త ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచాడు . ఈ విషయంలో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టాడు. నంబర్ వన్ బౌలర్ కోసం అండర్సన్, అశ్విన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అశ్విన్‌దే పైచేయి అయింది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ పురస్కారం సొంతం చేసుకున్నాడు అశ్విన్. ఈ ప్రతిభ కారణంగానే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌కు 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే జేమ్స్ అండర్సన్ ఇప్పుడు 859 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అంటే, ప్రపంచ నంబర్ వన్, నంబర్ టూ టెస్ట్ బౌలర్ల మధ్య ఇప్పుడు 10 పాయింట్ల అంతరం ఉంది. సహజంగానే, ఇప్పుడు అండర్సన్ ఈ దూరాన్ని తగ్గించడానికి యాషెస్ సిరీస్ వరకు వేచి ఉండాలి. అదే సమయంలో అశ్విన్ కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న ఏకైక స్పిన్నర్ అశ్విన్. అతను కాకుండా మిగిలిన నలుగురు ఫాస్ట్ బౌలర్లే. వీరిలో అండర్సన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ, పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ షా ఆఫ్రిది పేర్లు ఉన్నాయి. కమిన్స్‌కు 841 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రబడా 825 పాయింట్లతో ఉండగా, షాహీన్ 787 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. ఇక టాప్10 బౌలర్ల జాబితాలో ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. అశ్విన్ కాకుండా జస్‌ప్రీత్ బుమ్రా 7వ స్థానంలో, జడేజా 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
A whole host of India stars have climbed the charts in the @MRFWorldwide ICC Men’s Player Rankings after the Border-Gavaskar triumph ?
Details ?
— ICC (@ICC) March 15, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..