RCB vs PBKS Final: టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final: బెంగళూరు నాలుగోసారి, పంజాబ్ రెండోసారి ఫైనల్‌కు చేరాయి. అయితే ఇది రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి ఫైనల్ అవుతుంది. RCB 2009, 2011, 2016లో ఫైనల్‌లో ఓడిపోగా, PBKS 2014లో ఫైనల్‌లో ఓడిపోవలసి వచ్చింది.

RCB vs PBKS Final: టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే
Rcb Vs Pbks Toss Playing Xi

Updated on: Jun 03, 2025 | 7:13 PM

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final: ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది. ఇరుజట్లు 17 సంవత్సరాలుగా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఈ క్రమంలో శుభవార్త ఏమిటంటే టిమ్ డేవిడ్ ఫిట్ గా మారాడు. గాయం కారణంగా అతను చివరి 2 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఫిల్ సాల్ట్ కూడా భారతదేశానికి తిరిగి రావడం గమనార్హం. క్వాలిఫైయర్-1 తర్వాత తనకు బిడ్డ పుట్టిన సందర్భంగా ఇంగ్లాండ్ వెళ్ళాడు.

బెంగళూరు నాలుగోసారి, పంజాబ్ రెండోసారి ఫైనల్‌కు చేరాయి. అయితే ఇది రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి ఫైనల్ అవుతుంది. RCB 2009, 2011, 2016లో ఫైనల్‌లో ఓడిపోగా, PBKS 2014లో ఫైనల్‌లో ఓడిపోవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ లీగ్ కు 3 సంవత్సరాల తర్వాత కొత్త ఛాంపియన్ రానుంది. ఐపీఎల్ లో చివరిసారిగా 2022 లో కొత్త ఛాంపియన్ గా నిలిచింది. ఆ సమయంలో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ ను ఫైనల్ లో ఓడించింది. 2016 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి తొలి టైటిల్ ను గెలుచుకుంది.

ఇరు జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రెండు జట్ల ఇంపాక్ట్ ప్లేయర్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..