IPL 2025: పంజాబ్‌ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ! SRHపై ఓటమి.. ఇప్పుడు స్టార్‌ ప్లేయర్‌ టోర్నీకి దూరం!

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బలమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, స్టార్ పేసర్ లకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఆందోళన చెందుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం తక్కువ. ఫెర్గూసన్ లేకపోవడం పంజాబ్ కింగ్స్‌కు తీవ్రమైన నష్టం. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.

IPL 2025: పంజాబ్‌ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ! SRHపై ఓటమి.. ఇప్పుడు స్టార్‌ ప్లేయర్‌ టోర్నీకి దూరం!
Pbks Team

Updated on: Apr 14, 2025 | 8:16 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. గత మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయినప్పటికీ, PBKS బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఇంతలో పంజాబ్ కింగ్స్‌ను ఓ ఆటగాడి గాయం ఆందోళన పరుస్తోంది. స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్‌ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం సందేహంగా మారింది. ఐపీఎల్‌ 2025లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ కాలికి గాయం అయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రెండు బంతులు వేసిన తర్వాత ఫెర్గుసన్‌ తన ఎడమ తొడను పట్టుకుని, నొప్పితో విలవిల్లాడిపోయాడు.

ఆ తర్వాత గ్రౌండ్‌ వదిలి వెళ్లిపోయాడు. పంజాబ్‌ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఫెర్గూసన్ కు ప్రస్తుతం రెస్ట్‌ అవసరం అని వెల్లడించాడు. “ఫెర్గూసన్ తర్వాత మ్యాచ్‌లు ఆడలేడు. టోర్నమెంట్ ముగిసే సమయానికి మేము అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఆశిస్తున్నా.. అతను అందుబాటులో ఉంటాడని ఇప్పుడే చెప్పలేం. అని ముల్లన్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పంజాబ్‌ మ్యాచ్‌ తర్వాత హోప్స్ అన్నారు. మరి ఫెర్గుసన్‌ పూర్తిగా టోర్నీకి దూరమైతే.. పంజాబ్‌ ఏ ప్లేయర్‌ను రీప్లేస్‌మెంట్‌ తీసుకుంటుందో చూడాలి. అయితే ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఫెర్గుసన్‌ లేకపోవడం పంజాబ్‌ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..