IPL 2025: ఇద్దరినే రిటైన్ చేసిన పంజాబ్ కింగ్స్.. రూ. 112 కోట్లతో ఐపీఎల్ వేలానికి సిద్ధం..

IPL 2025 Retention: ఐపీఎల్ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఐపీఎల్ 2025 కోసం కొత్త టీమ్‌ని నిర్మించాలని భావిస్తున్నారట. తద్వారా ఐపీఎల్ సీజన్-18లో పంజాబ్ కింగ్స్ జట్టులో గణనీయమైన మార్పు రానుందని చెప్పొచ్చు.

IPL 2025: ఇద్దరినే రిటైన్ చేసిన పంజాబ్ కింగ్స్.. రూ. 112 కోట్లతో ఐపీఎల్ వేలానికి సిద్ధం..
Punjab Kings Ipl 2025
Follow us

|

Updated on: Oct 31, 2024 | 11:14 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవచ్చు. కానీ, పంజాబ్ కింగ్స్ ఈ ఎంపికను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాగే ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేయాలని నిర్ణయించింది. ఇది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు కూడా ప్రత్యేకం.

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే సీజన్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే గత సీజన్‌లో జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లందరినీ విడుదల చేయాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ 2025 కోసం కొత్త టీమ్‌ని నిర్మించాలని భావిస్తున్నారట. పంజాబ్ కింగ్స్ విడుదల చేసే, రిటైన్ చేసే ఇతర ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

శశాంక్ సింగ్: శశాంక్ సింగ్ IPL 2024లో పంజాబ్ కింగ్స్ తరపున 14 మ్యాచ్‌లు ఆడాడు. 2 తుఫాన్ హాఫ్ సెంచరీలతో మొత్తం 354 పరుగులు చేశాడు. జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో శశాంక్ సింగ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది.

ప్రభ్‌సిమ్రాన్ సింగ్: పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్‌గా ఉన్న ప్రభసిమ్రాన్ సింగ్ తుఫాన్ బ్యాటింగ్‌కు కూడా పేరుగాంచాడు. ముఖ్యంగా గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 2 అర్ధసెంచరీలతో 334 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రభాస్‌ను జట్టులో కొనసాగించాలని నిర్ణయించింది.

ఇక్కడ ప్రభసిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్ జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లు ఉన్నారు. తద్వారా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ల జాబితాలో అతడ్ని నిలబెట్టుకోవచ్చు. దీని ప్రకారం ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.4 కోట్లు ఇవ్వనుంది.

ఇద్దరికీ రూ. 8 కోట్లు ఇవ్వనున్నారు. మొత్తం బిడ్ మొత్తం నుంచి తీసివేస్తే.. IPL మెగా వేలానికి ముందు రూ. 112 కోట్లు ఉండనున్నాయి. ఇదే పర్స్‌తో పంజాబ్ కింగ్స్‌తో మెగా యాక్షన్‌లో కనిపించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్