Prithvi Shaw: టీమిండియా సెలెక్టర్లపై కీలక కామెంట్స్ చేసిన డబుల్ సెంచరీ ప్లేయర్.. ఏమన్నాడంటే?
Indian Cricket Team: పృథ్వీ షా చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. నిన్న ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్‌లో డబుల్ సెంచరీ సాధించి, ఆ తర్వాత టీమిండియాలో తన ఎంపిక గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియాకు ప్రపంచకప్ గెలవాలని, 12-14 ఏళ్ల పాటు టీమ్ ఇండియా తరపున ఆడాలని కోరుకుంటున్నట్లు షా తెలిపాడు. ఈ ఏడాది ప్రారంభంలో షా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు.

India vs West Indies: చాలా కాలంగా టీమిండియాకు దూరమైన పృథ్వీ షా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ ఆడుతున్నాడు. అక్కడ అతను తుఫాన్ వేగంతో డబుల్ సెంచరీ చేసి, ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇది అతని లిస్ట్ ఏ కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ. నార్తాంప్టన్‌షైర్ తరపున షా సోమర్‌సెట్‌పై 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. తుఫాను బ్యాటింగ్ తర్వాత, పృథ్వీ షా టీమ్ ఇండియాలో తన ఎంపిక గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా నుంచి తప్పుకోవడంపై బహిరంగంగానే మాట్లాడాడు.
తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పలేదంటూ షా చెప్పుకొచ్చాడు. తన ఫిట్‌నెస్ కారణంగానే జట్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను ఫిట్‌నెస్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాను. అయినా ఎంపిక కాలేదంటూ షా చెప్పుకొచ్చాడు.




ప్రపంచకప్ గెలవాలనే కోరిక..
Career bests deserve cuddles. 🥰
2⃣4⃣4⃣ – Prithvi Shaw’s highest List A score 4️⃣/4️⃣9️⃣ – Rob Keogh’s best List A bowling figures pic.twitter.com/CBYQ30pn94
— Northamptonshire CCC (@NorthantsCCC) August 9, 2023
టీమ్ ఇండియాకు ప్రపంచకప్ గెలవాలని, 12-14 ఏళ్ల పాటు టీమ్ ఇండియా తరపున ఆడాలని కోరుకుంటున్నట్లు షా తెలిపాడు. ఈ ఏడాది ప్రారంభంలో షా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. 500 రోజుల తర్వాత ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. అతను జులై 2021లో భారతదేశం తరపున చివరి మ్యాచ్ ఆడాడు.
నిరాశపరిచిన పృథ్వీ షా..
This is 6 minutes of pure batting heaven from Prithvi Shaw.
Enjoy. 😍pic.twitter.com/iKKjOOF3i1
— Northamptonshire CCC (@NorthantsCCC) August 9, 2023
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, తనను తొలగించిన సమయంలో కారణం చెప్పలేదని షా ప్రకటించాడు. ఫిట్‌నెస్ వల్ల ఇలా జరుగుతుందని ఎవరో చెప్పారు. ఆ తర్వాత అతను NCAలో ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మంచి స్కోర్ చేశాడు. కానీ, వెస్టిండీస్ పర్యటనలో అతనికి మళ్లీ అవకాశం రాలేదు. తాను నిరాశకు గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు.
రికార్డుల రారాజుగా షా
A masterclass from Prithvi Shaw propelled Northamptonshire to an 87 run victory over Somerset.
Rob Keogh then claimed a career best 4/49 as the Steelbacks climbed to second on the Group B table.
— Northamptonshire CCC (@NorthantsCCC) August 9, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
