
Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ 10వ సీజన్ (Pro Kabaddi 2023) డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి లెగ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ సమయంలో అన్ని మ్యాచ్‌లు ట్రాన్స్‌స్టేడియా స్టేడియంలో జరగనున్నాయి. తొలిరోజు రెండు అద్భుతమైన మ్యాచ్‌లు చూడబోతున్నారు అభిమానులు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), తెలుగు టైటాన్స్ (Telugu Titans)తో తలపడగా, రెండో మ్యాచ్‌లో యు ముంబా (U Mumba), యూపీ యోధాస్ (UP Yoddhas)తో తలపడనుంది.
డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 7 వరకు అహ్మదాబాద్ లెగ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా, డిసెంబర్ 2,3,4,6, 7 తేదీల్లో రెండు మ్యాచ్‌లు జరుగనుండగా, డిసెంబర్ 5న ఒక మ్యాచ్ మాత్రమే జరగనుంది. కాగా, గుజరాత్ జెయింట్స్ జట్టు గరిష్టంగా 4 మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇది కాకుండా, యూపీ యోధాస్, జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, యు ముంబా, పాట్నా పైరేట్స్ ఏడు జట్లు ఈ దశలో చెరో రెండు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి.
దబాంగ్ ఢిల్లీ కేసీ, హర్యానా స్టీలర్స్, పుణెరి పల్టాన్, తమిళ్ తలైవాస్ జట్లు ఒకే ఒక్క మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ లెగ్‌లో అభిమానులు ఫజల్ అత్రాచలీని 4 సార్లు చూడగలరు. పవన్ సెహ్రావత్, పర్దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి వంటి దిగ్గజాలను రెండుసార్లు ఈ లెగ్‌లో చూడగలరు. అహ్మదాబాద్ లెగ్ చివరి మ్యాచ్‌లో గుజరాత్, పాట్నా జట్లు తలపడనున్నాయి. ఈ కథనంలో, ప్రో కబడ్డీ 2023 అహ్మదాబాద్ లెగ్‌లో జరగబోయే అన్ని మ్యాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
It’s time to unleash our inner 𝘼𝙉𝙄𝙈𝘼𝙇 🦁#GiantArmy, tamara roaring cheers saathe taiyyar thai jao for this blockbuster! 🔥#GarjegaGujarat #GGvTT #ProKabaddi #Adani pic.twitter.com/MRfGfB5KaV
— Gujarat Giants (@GujaratGiants) December 2, 2023
2 డిసెంబర్ 2023న తొలి మ్యాచ్ – గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్, రాత్రి 8 గంటలకు
రెండవ మ్యాచ్ – యూ ముంబా vs యూపీ యోధాస్, రాత్రి 9 గంటలకు
3 డిసెంబర్ 2023
మూడో మ్యాచ్ – తమిళ్ తలైవాస్ vs దబాంగ్ ఢిల్లీ KC, రాత్రి 8 గంటలకు
నాల్గవ మ్యాచ్ – గుజరాత్ జెయింట్స్ vs బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు
4 డిసెంబర్ 2023
5వ మ్యాచ్ – పుణెరి పల్టన్ vs జైపూర్ పింక్ పాంథర్స్, రాత్రి 8గంటలకు
ఆరో మ్యాచ్ – బెంగళూరు బుల్స్ vs బెంగాల్ వారియర్స్, రాత్రి 9 గంటలకు
5 డిసెంబర్ 2023
ఏడో మ్యాచ్ – గుజరాత్ జెయింట్స్ vs యు ముంబా, రాత్రి 8 గంటలకు
6 డిసెంబర్ 2023
8వ మ్యాచ్ – తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, రాత్రి 8గంటలకు
9వ మ్యాచ్ – UP యోధాస్ vs హర్యానా స్టీలర్స్, రాత్రి 9 గంటలకు
7 డిసెంబర్ 2023
10వ మ్యాచ్ – బెంగాల్ వారియర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, రాత్రి 8 గంటలకు
11వ మ్యాచ్ – గుజరాత్ జెయింట్స్ vs పాట్నా పైరేట్స్, రాత్రి 9 గంటలకు
A Zabar-dus-t Panga like no other ⚔🔥
Watch Mumboys 🆚 Yoddhas tonight, 7:30 PM onwards, LIVE on the Star Sports Network and for free on the Disney+Hotstar mobile app!#ProKabaddi #PKLSeason10 #HarSaansMeinKabaddi #MUMvUP pic.twitter.com/OBm4hLclpj
— ProKabaddi (@ProKabaddi) December 2, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..