Video: ఔటైనా క్రీజు వదలని ఆస్ట్రేలియా ఆటగాడు.. కట్‌చేస్తే.. షాకిచ్చిన అంపైర్.. ఇంత బలుపు పనికిరాదన్న నెటిజన్లు

Peter Handscomb: విక్టోరియా బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ నాలుగో నంబర్‌లో క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో అతని జట్టు కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్‌కు ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్లో విల్ పుకోవ్స్కీ కూడా ఔట్ అయ్యాడు. ఆపై 13వ ఓవర్లో హ్యాండ్స్‌కాంబ్ ఔట్ అయ్యాడు. అయితే, బయటకు వెళ్లేందుకు హ్యాండ్స్‌కాంబ్ నిరాకరించాడు. నిజానికి, ఫాస్ట్ బౌలర్ బ్రాండన్ డాగెట్ వేసిన బంతికి హ్యాండ్‌కాంబ్ స్లిప్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఫీల్డర్ క్యాచ్ పట్టేలోపు బంతి నేలను తాకినట్లు హ్యాండ్‌కాంబ్ భావించాడు.

Video: ఔటైనా క్రీజు వదలని ఆస్ట్రేలియా ఆటగాడు.. కట్‌చేస్తే.. షాకిచ్చిన అంపైర్.. ఇంత బలుపు పనికిరాదన్న నెటిజన్లు
Peter Handscomb

Updated on: Nov 28, 2023 | 2:58 PM

Sheffield Shield Victoria vs South Australia Match: ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు చాలా ప్రతిభావంతులు. కానీ, మైదానంలో వారి చర్యలు తరచుగా వివాదాలకు కారణం అవుతుంటాయి. తాజాగా షెఫీల్డ్ షీల్డ్‌లో ఇలాంటిదే కనిపించింది. అక్కడ ఒక సీనియర్ ఆస్ట్రేలియన్ ఆటగాడు ఔట్ అయినప్పటికీ ఫీల్డ్ వదిలి వెళ్ళడానికి నిరాకరించాడు. అడిలైడ్‌లో దక్షిణ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత పెవిలియన్‌కు తిరిగి రావడానికి నిరాకరించిన ఆస్ట్రేలియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ గురించి మాట్లాడుతున్నాం.

హ్యాండ్‌కాంబ్ ఏం చేశాడంటే?

విక్టోరియా బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ నాలుగో నంబర్‌లో క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో అతని జట్టు కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్‌కు ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 11వ ఓవర్లో విల్ పుకోవ్స్కీ కూడా ఔట్ అయ్యాడు. ఆపై 13వ ఓవర్లో హ్యాండ్స్‌కాంబ్ ఔట్ అయ్యాడు. అయితే, బయటకు వెళ్లేందుకు హ్యాండ్స్‌కాంబ్ నిరాకరించాడు. నిజానికి, ఫాస్ట్ బౌలర్ బ్రాండన్ డాగెట్ వేసిన బంతికి హ్యాండ్‌కాంబ్ స్లిప్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఫీల్డర్ క్యాచ్ పట్టేలోపు బంతి నేలను తాకినట్లు హ్యాండ్‌కాంబ్ భావించాడు. అయితే, అంపైర్లు అతడిని ఔట్ చేశారు. ఈ నిర్ణయం వచ్చినప్పటికీ, హ్యాండ్‌కాంబ్ పిచ్‌పైనే ఉండి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అంపైర్లతో మాట్లాడాడు. చివరగా అంపైర్లు హ్యాండ్స్‌కాంబ్‌ను పెవిలియన్‌కు పంపాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

క్రీజు నుంచి కదలని పీటర్ హ్యాండ్స్‌కాంబ్..

చివరకు అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. అతని చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, హ్యాండ్‌కాంబ్ ఇలా ఎందుకు చేశాడు? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

హ్యాండ్స్‌కాంబ్ ఎవరు?

పీటర్ హ్యాండ్‌కాంబ్ ఆస్ట్రేలియాలో టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 20 టెస్టుల్లో రెండు సెంచరీలతో సహా 1079 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఆటగాడు 21 సెంచరీల ఆధారంగా 10 వేలకు పైగా పరుగులు చేశాడు. హ్యాండ్‌కాంబ్‌కు 22 ODI మ్యాచ్‌ల అనుభవం ఉంది. అందులో అతను తన బ్యాట్‌తో 33.26 సగటుతో 632 పరుగులు చేశాడు. అతని పేరులో వన్డే సెంచరీ కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..