పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజం సేథీ కీలక వ్యాఖ్యలు అందించారు. ఆసియా కప్ 2023ని పాకిస్థాన్‌లో నిర్వహించకపోతే బోర్డుకు దాదాపు 3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చాడు. మేం హైబ్రిడ్ మోడల్‌ను సూచించామని, ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని కోరుకుంటున్నామని నజామ్ సేథీ అన్నారు. దీని కింద భారత జట్టు తమ మ్యాచ్‌లను వేరే ఏదైనా మైదానంలో ఆడాల్సిఉంటుంది. కానీ, మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్ మైదానంలో ఆడాలి. అలాగే, మేం మరే ఇతర ప్రతిపాదనను అంగీకరించబోమని, అలాగే మరే ఇతర ఎంపికను అంగీకరించబోమని ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్‌కు ఆసియా కప్ 2023 ఆతిథ్యం లభించింది. అయితే టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో ఆడదని బీసీసీఐ చెబుతోంది. ఆ తర్వాత టోర్నీ ఎక్కడ నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, BCCI మధ్య విభేదాల తర్వాత, PCB ఛైర్మన్ నజం సేథీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. దీని కింద భారత జట్టు ఏదైనా ఇతర మైదానంలో ఆడాలి. కానీ, టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్ మైదానంలో ఆడాలి. ఆసియా కప్ 2023 ఆతిథ్యం మా వద్ద ఉందని, దానిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోబోమని నజం సేథి స్పష్టంగా చేశారు.
పాకిస్థాన్‌లో ఎలాంటి భద్రతా సమస్య లేదని, అయితే భారత ప్రభుత్వం తమ ఆటగాళ్లను పాకిస్థాన్‌లో ఆడేందుకు అనుమతించకపోతే లిఖిత పూర్వక ఆధారాలు చూపించాలని నజం సేథీ అంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు మా దేశంలో ఆడేందుకు వస్తున్నాయని, కాబట్టి భారత జట్టు కూడా రావాలని కోరాడు. ఇది కాకుండా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీని భారత గడ్డపై ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు వెళ్లలేదా? ఈ ప్రశ్నకు సమాధానంగా, ఐసీసీతో మా సంబంధం భిన్నంగా ఉందని, అయితే ఇవన్నీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నజామ్ సేథీ అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..