Asia Cup 2022 Final: పాకిస్తాన్ ఛాంపియన్ అయ్యేనా.. రికార్డులు చూస్తే లంకదే ఆధిపత్యం.. టాస్ గెలిచిన బాబర్..
SL vs PAK Final: పాకిస్తాన్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లంక టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది.
Sri Lanka vs Pakistan, Final: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లంక టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. శ్రీలంక 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. దీంతో ఈ సారి గెలిచి ముచ్చటగా మరోసారి ట్రోఫీని గెలుచుకోవాలని బాబర్ సేన ఆరాటపడుతోంది. ఇక్కడ పాకిస్థాన్‌కు పదేళ్ల తర్వాత విజేతగా నిలిచే అవకాశం ఉంది. కాగా శ్రీలంక 8 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవాలనుకుంటోంది. ఈ ఈవెంట్‌లో గత 16 రోజుల్లో యూఏఈలో 13 మ్యాచ్‌ల్లో 6 జట్లు సత్తా చాటాయి.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 13, శ్రీలంక 9 గెలిచాయి. అదే సమయంలో, ఆసియా కప్ గురించి మాట్లాడితే, ఇరు జట్లు మూడోసారి ఫైనల్‌లో తలపడనున్నాయి. 8 ఏళ్ల క్రితం చివరిసారిగా ఇరు జట్లు ఫైనల్ ఆడాయి. 2014లో శ్రీలంక గెలిచింది.
ఇరు జట్లు 2000, 1986లో టైటిల్ మ్యాచ్‌లకు చేరుకున్నారు. ఫైనల్‌లో గెలిచే విషయంలో శ్రీలంక బలంగా ఉంది. శ్రీలంక రెండు ఫైనల్స్‌లో (1986, 2014) విజయం సాధించింది. పాకిస్థాన్ (2000) ఒకటి మాత్రమే గెలిచింది.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్