
వరల్డ్‌కప్ సందడి మొదలైపోయింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లో దిగింది పాక్ జట్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత భారతగడ్డపై అడుగుపెట్టింది దాయాది టీం. పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. ఏడేళ్ల తర్వాత దాయాది టీమ్ తొలిసారి ఇండియాకు వచ్చింది. అది కూడా హైదరాబాద్‌కు చేరుకోవడం విశేషం. ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది పాకిస్తాన్.
నిన్న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్తాన్ జట్టును పార్క్ హయత్ వరకు పటిష్ట భద్రత నడుమ తీసుకొచ్చారు. మరోవైపు మంగళవారం రాత్రి న్యూజిలాండ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు రాగా.. బుధవారం రాత్రి మిగతా ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో న్యూజిలాండ్ జట్టు బస చేసింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్తు దృష్ట్యా సెప్టెంబర్ 29న పాకిస్థాన్ – న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్‌కి క్రికెట్ అభిమానులకు అనుమతి లేదు. అభిమానులు లేకుండానే ఇరు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 3న జరిగే వార్మప్ మ్యాచ్, 6, 9, 10 తేదీల్లో జరిగే ప్రధాన మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియంలోకి అభిమానులకు అనుమతి ఉంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు ఆడబోతోంది. ఈరోజు మ్యాచ్‌తోపాటు.. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో వామప్ కూడా ఆడనుంది. ఇక నెదర్లాండ్స్‌తో అక్టోబర్ 6న, శ్రీలంకతో 10న లీగ్ మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడబోతోంది పాకిస్తాన్ టీమ్.
A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK
— Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..