AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఫోర్లు, 2 సిక్సర్లతో పరుగుల సునామీ.. చివర్లో వచ్చిన పాక్‌ను చితక్కొట్టిన ఆటగాళ్లు.. ఎవరో తెలుసా?

కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. మరో 5 పరుగులు జోడించి..

12 ఫోర్లు, 2 సిక్సర్లతో పరుగుల సునామీ.. చివర్లో వచ్చిన పాక్‌ను చితక్కొట్టిన ఆటగాళ్లు.. ఎవరో తెలుసా?
Nz Vs Pak
Ravi Kiran
|

Updated on: Jan 03, 2023 | 7:27 PM

Share

కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. మరో 5 పరుగులు జోడించి.. కివీస్ జట్టును పెవిలియన్ చేర్చాలనుకున్న పాకిస్తాన్ జట్టు ఆశలపై ఓ న్యూజిలాండ్ ప్లేయర్ నీళ్లు చల్లాడు. పాక్ బౌలర్ల భరతం పట్టాడు. మైదానానికి అన్ని వైపులా బౌండరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ 10వ నెంబర్ ఆటగాడు మాట్ హెన్రీ(68) అర్ధ సెంచరీతో అదరగొట్టి అజేయంగా నిలవగా.. నెంబర్ 11 బ్యాటర్ ఎజాజ్ పటేల్(35) అతడికి మంచి సహకారాన్ని అందించి 10వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది పాకిస్తాన్‌లో 10వ వికెట్‌కు విదేశీ జట్టు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం.

మ్యాట్ హెన్రీ, ఎజాజ్ పటేల్ సెంచరీ భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ 68 పరుగులు చేసి.. చివరి వరకు అజేయంగా నిలవగా.. ఎజాజ్ పటేల్ 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. వారిద్దరికీ ఇదే టెస్టుల్లో అత్యుత్తమ స్కోర్. 9 వికెట్లకు న్యూజిలాండ్ 345 పరుగులు చేయగా.. 10 వికెట్‌కు వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యం కారణంగా చివరికి 449 పరుగులకు ఆలౌట్ అయింది.

న్యూజిలాండ్ జట్టు 345 పరుగులకే పాకిస్థాన్ 9 వికెట్లు కోల్పోయింది. అయితే 10వ వికెట్‌కు భాగస్వామ్య ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగలిగింది. విదేశీ గడ్డపై ఓ టెస్టు మ్యాచ్‌లో 10వ వికెట్‌కు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు జోడించడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది 11వ సారి. అంతేకాదు న్యూజిలాండ్ జట్టు ఈ ఘనత మూడోసారి సాధించింది. అయితే 2013లో చేసిన 163 పరుగుల ప్రపంచ రికార్డు మాత్రం చెరిగిపోలేదు.

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!