ఎన్నో ఆశలు కుప్పకూలిపోయాయి. దాయాది పాక్‌ను ఓడించి.. విజయగర్వం చాటాలని దేశం మొత్తం ఆశపడింది. కానీ అనుకున్నట్లు జరగలేదు. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాట్స్‌మెన్ తడబడటం వల్ల ప్రత్యర్థి ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది కోహ్లీసేన. బాలింగ్ విభాగం కూడా సత్తా చాటకపోవడంతో ఒక్క వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని పాక్ కైవసం చేసుకుంది. ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ చాలా క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు రిజ్వాన్ చేసిన ప్రాక్టీస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అది యుద్దంమైనా, ఆట అయినా.. పోరు ఏదైనా గెలవాలంటే.. పక్కా ప్రణాళిక ముఖ్యం. అంతకుముందు అంతే సాధన కూడా ఉండాలి. రిజ్వాన్ అదే చేసి చూపించాడు. ఇండియాపై మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో.. ముందే ఎలాంటి షాట్లను ఆడాలో పక్కాగా సాధన చేశాడు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు వికెట్ల వెనకాల నిలబడి షాట్లు ఆడాడు. తర్వాత టార్గెట్ చేధనలో బరిలో దిగి అదే షాట్లను మ్యాచ్‌లోనూ ఆడాడు. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిజ్వాన్‌పై ఓ నెటిజన్లు ఓ రేంజ్‌లో ప్రశంసిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆడాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Dream. Visualise. Execute.
Mohammad Rizwan’s masterpiece started before a ball was bowled ?#T20WorldCup #INDvPAK pic.twitter.com/o4m8biFhdP
— ICC (@ICC) October 25, 2021
భారత్ ఘోర వైఫల్యంపై కొనసాగుతోన్న రగడ…!
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్‌పై రగడ కొనసాగుతోంది. టీమిండియాలో 11 మంది ప్లేయర్లు ఉన్నారని , కాని ఒక మహ్మద్ షమీని మాత్రమే ఓటమికి ఎందుకు బాధ్యుడు చేస్తున్నారని విమర్శించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముస్లిం కావడంతో షమీని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని , అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: ఇండియా కొంపముంచినవి.. పాక్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే..
ఆనందయ్య పెట్టుకున్న దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం