Watch Video: ఈ చెత్త ఫీల్డింగ్ పాక్ ఆటగాళ్లకే సాధ్యం.. మరోసారి నవ్వులపాలైన బాబర్ సేన.. వైరల్ వీడియో..

Mohammad Nawaz and Mohammad Wasim Viral Video: క్రికెట్‌లో క్యాచ్ పట్టుకోవడం మ్యాచ్ గెలవడానికి నేరుగా ముడిపడి ఉంటుందనే సంగతి తెలిసిందే. మెరుగైన ఫీల్డింగ్ ఉన్న జట్టు విజయానికి బలమైన పోటీదారుగా ఉంటుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇందుకు పెద్ద ఉదాహరణ. టీమ్ ఇండియా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. గత కొన్నేళ్లుగా నిరంతరంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మరి ఇప్పుడు పాకిస్థాన్ జట్టు తన ఫీల్డింగ్‌ను ఎలా మెరుగుపరుస్తుందో చూడాలి.

Watch Video: ఈ చెత్త ఫీల్డింగ్ పాక్ ఆటగాళ్లకే సాధ్యం.. మరోసారి నవ్వులపాలైన బాబర్ సేన.. వైరల్ వీడియో..
Pakistan Vs Australia

Updated on: Oct 03, 2023 | 5:48 PM

Pakistan vs Australia, 10th Warm-up game: పాకిస్తాన్ టీం అంటేనే ఫాస్ట్ బౌలింగ్‌కు పేరుగాంచింది. అలాగే బ్యాటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ జట్టు క్రికెట్ మూడవ విభాగంలో మాత్రం తుస్సుమంటోంది. అంటే, ఫీల్డింగ్ గురించి మాట్లాడితే, ఎల్లప్పుడూ పాక్ టీం నవ్వులపాలవుతుంటుంది. మెరుగుపడాలని ఎంతమంది కోరినా.. పదేపదే అవే తప్పులు చేస్తూ.. సోషల్ మీడియాలో అబాసుపాలవుతోంది. 2023 ప్రపంచకప్‌నకు ముందు, ఈ కారణంగా పాక్ జట్టును కూడా ఎగతాళి చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో, పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు పేలవమైన ఫీల్డింగ్ చేసి మొత్తం జట్టును ఎగతాళి చేసేలా చేశారు. ఈ ఆటగాళ్ళు మహ్మద్ వాసిమ్, మహ్మద్ నవాజ్. ఒక పొరపాటు కారణంగా బంతి బౌండరీకి తరలి వెళ్లింది. అయితే అదే సమయంలో వారి జట్టు కూడా సోషల్ మీడియాలో జోకర్‌గా మారింది.

ఈ సంఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లోని 23వ ఓవర్‌లో హారిస్ రౌఫ్ వేసిన బంతిని మార్నస్ లాబుస్‌చాగ్నే డీప్ స్క్వేర్ లెగ్ వైపుగా తరలించాడు. మహ్మద్ వసీమ్, మహ్మద్ నవాజ్ బంతిని పట్టుకునేందుకు పరుగెత్తారు. కానీ, వారిద్దరూ బంతిని పట్టుకోలేదు. వసీమ్ బంతిని పట్టుకుంటాడని నవాజ్, నవాజ్ బంతిని పట్టుకుంటాడని వసీమ్ అనుకున్నారు. ఈ గందరగోళంలోనే వీరిద్దరి మధ్య బాల్ పాస్ కావడంతో ఆస్ట్రేలియాకు నాలుగు పరుగులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ ఫీల్డింగ్‌పై జోకులు..

నవాజ్, వసీం చేసిన ఈ తప్పిదం వల్ల పాకిస్థాన్ అపహాస్యం పాలవుతోంది. ప్రతి ICC టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పేలవమైన ఫీల్డింగ్ కనిపిస్తుంది. ఈసారి కూడా అదే జరుగుతోంది. 2011 ప్రపంచ కప్ నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ గరిష్టంగా 59 క్యాచ్‌లను వదులుకుంది. ఈ విషయంలో పాకిస్థాన్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా శ్రీలంక 43 క్యాచ్‌లను వదిలి రెండో స్థానంలో ఉంది.

క్యాచ్ పడితేనే మ్యాచ్ గెలిచేది..

క్రికెట్‌లో క్యాచ్ పట్టుకోవడం మ్యాచ్ గెలవడానికి నేరుగా ముడిపడి ఉంటుందనే సంగతి తెలిసిందే. మెరుగైన ఫీల్డింగ్ ఉన్న జట్టు విజయానికి బలమైన పోటీదారుగా ఉంటుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇందుకు పెద్ద ఉదాహరణ. టీమ్ ఇండియా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. గత కొన్నేళ్లుగా నిరంతరంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మరి ఇప్పుడు పాకిస్థాన్ జట్టు తన ఫీల్డింగ్‌ను ఎలా మెరుగుపరుస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..