World Cup 2023: నరేంద్ర మోడీ స్టేడియంలో మేం ఆడం.. ఐసీసీని కోరిన పాకిస్తాన్..

India vs Pakistan: అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలోని ముఖ్యమైన మైదానాల పునరుద్ధరణ ఇప్పటికే జరుగుతోంది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌లో భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త పాటపాడుతోంది.

World Cup 2023: నరేంద్ర మోడీ స్టేడియంలో మేం ఆడం.. ఐసీసీని కోరిన పాకిస్తాన్..
Ind Vs Pak World Cup 2023

Updated on: Jun 08, 2023 | 9:43 PM

World Cup 2023: అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. దేశంలోని ముఖ్యమైన మైదానాల పునరుద్ధరణ ఇప్పటికే జరుగుతోంది. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్‌లో భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త పాటపాడుతోంది. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందితే తమ మ్యాచ్‌లను నిర్దిష్ట మైదానాల్లో షెడ్యూల్ చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని అభ్యర్థించింది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జియోఫ్ అల్లార్డైస్‌లను అభ్యర్థించారు.

అయితే, అహ్మదాబాద్‌లో నాకౌట్ మ్యాచ్‌లు ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో పాకిస్థాన్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేయాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదనను సమర్పించింది. అయితే ఇప్పుడు అదే మైదానంలో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ విముఖత చూపుతోంది.

పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి భారత్ వైదొలిగింది. టోర్నమెంట్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని కోరింది. దీన్నిబట్టి ఇప్పుడు వన్డే ప్రపంచకప్ మైదానాల విషయంలో బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త సమస్య సృష్టించబోతోందని విశ్లేషిస్తున్నారు.

అయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య హైవోల్టేజ్‌ పోరును నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్‌ చేసింది. కాబట్టి ఈ ప్లాన్‌ నుంచి భారత క్రికెట్‌ బోర్డు వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..