IND vs PAK: ఐసీసీ దెబ్బకు ఆడకుండానే పాకిస్తాన్‌కు డబుల్ షాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

IND vs PAK, ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రమాదంలో పడింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాక్ జట్టుకు డబుల్ షాక్ తగలనుంది.

IND vs PAK: ఐసీసీ దెబ్బకు ఆడకుండానే పాకిస్తాన్‌కు డబుల్ షాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
Pakistan In T20 Wc 2026

Updated on: Feb 02, 2026 | 7:45 AM

IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 (ICC T20 World Cup 2026) మ్యాచ్ వచ్చే నెల ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే టీమిండియా దూకుడు చూసి కాసింత భయపడినట్లైంది. ఓటమి భయంతో పాకిస్తాన్ ఆలోచనల్లో పడిపోయింది. దీంతో ఆ దేశ ప్రభుత్వంతో కలిసి ఓ చెత్త స్కెచ్ వేసింది. ఓటమి నుంచి తప్పించుకోకునేందుకు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఐసీసీ గరమైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌కు డబుల్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.

పాకిస్తాన్ చేసిన తప్పు..

2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం గ్రూప్ ఏలో పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్, నమీబియా, నెదర్లాండ్స్‌తో ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను కూడా పాకిస్తాన్ బహిష్కరించాలని ప్లాన్ చేసింది. ఐసీసీ నిబంధనల కారణంగా, తమ జట్టు గ్రూప్ దశ నుంచి నిష్క్రమించి స్వదేశానికి తిరిగి రావచ్చని పాకిస్తాన్‌కు తెలియకపోవచ్చు.

పాకిస్తాన్ కు ఏమవుతుంది..?

పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే, అది రెట్టింపు నష్టాన్ని చవిచూడనుంది. ఐసీసీ నియమం 16.10.7 ప్రకారం, పాకిస్తాన్ భారత్‌తో ఆడకపోతే, దాని నెట్ రన్ రేట్ ప్రభావితం అవ్వొచ్చు. కానీ, భారత్ నెట్ రన్ రేట్ మాత్రం మారదు. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెండు పాయింట్లు అందుకుంటుంది. పాకిస్తాన్‌కు మాత్రం ఏమీ లభించదు.

ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ డబుల్ షాక్ చవిచూడాల్సి రావొచ్చు. ఆ జట్టు కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవచ్చు.

పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్..

ఫిబ్రవరి 4, 2026 పాకిస్తాన్ vs ఐర్లాండ్ (వార్మ్-అప్) కొలంబో

ఫిబ్రవరి 7, 2026 – పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, కొలంబో

ఫిబ్రవరి 10, 2026 – పాకిస్తాన్ vs అమెరికా, కొలంబో

ఫిబ్రవరి 15, 2026 – ఇండియా vs పాకిస్తాన్, కొలంబో

ఫిబ్రవరి 18, 2026 – పాకిస్తాన్ vs నమీబియా, కొలంబో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..