IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌ ముందు పాక్‌కు షాక్‌.. 9 రోజుల్లోనే నంబర్‌ వన్‌ గోవిందా.. టాప్‌ ప్లేస్‌ ఆజట్టుదే

ఆసియా కప్ సూపర్ ఫోర్ రౌండ్‌లో టీమిండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్ జట్టుకు షాక్‌ తగిలింది. తాజాగా రిలీజ్‌ చేసిన వన్డే ర్యాకింగ్స్‌ జాబితాలో ఆ జట్టు నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రపంచంలోనే కొత్త నెం.1 వన్డే జట్టుగా అవతరించింది.

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌ ముందు పాక్‌కు షాక్‌.. 9 రోజుల్లోనే నంబర్‌ వన్‌ గోవిందా.. టాప్‌ ప్లేస్‌ ఆజట్టుదే
Pakistan Cricket Team

Updated on: Sep 10, 2023 | 2:26 PM

ఆసియా కప్ సూపర్ ఫోర్ రౌండ్‌లో టీమిండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్ జట్టుకు షాక్‌ తగిలింది. తాజాగా ఐసీసీ  రిలీజ్‌ చేసిన వన్డే ర్యాకింగ్స్‌ జాబితాలో దాయాది పాక్ జట్టు నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రపంచంలోనే కొత్త నెంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించింది. కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానం కోసం ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు జట్లు వన్డే మ్యాచ్‌లు ఆడిన ప్రతిసారీ ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ నంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కంగారూలు వరుస విజయాలు సాధించారు. తద్వారా మళ్లీ నెం.1 టైటిల్ ను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ 120 పాయింట్లతో ర్యాంకింగ్ జాబితాలో 2వ స్థానంలో ఉంది. ఇక భారత్ 114 రేటింగ్స్‌తో నెంబర్ 3 స్థానంలో ఉంది. కాగా ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్‌తో పాకిస్థాన్ వన్డే మ్యాచ్ ఆడనుంది, ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మళ్లీ ర్యాంకింగ్‌లో మార్పులు రావచ్చు. ఒకవేళ భారత్‌పై పాకిస్థాన్ ఓడిపోతే ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతుంది.

 నేటి మ్యాచ్ లో  పాక్ గెలిస్తే మళ్లీ ర్యాంకింగ్స్ లో మార్పులు 

కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగిస్తోంది. తాజాగా రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇద్దరి సెంచరీల సాయంతో ప్రత్యర్థికి 392 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా కేవలం 269 పరుగులకే ఆలౌట్ కావడంతో 123 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. అలాగే వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ ఆస్ట్రేలియా జట్టుకే అందలం..

మరికొన్ని గంటల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్

వాతావరణం అనుకూలించేనా?

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..