IND vs PAK Match Playing XI: టాస్ ఓడిన రోహిత్.. ప్లేయింగ్ XI నుంచి ఇద్దరు ఔట్..
Pakistan vs India Match Playing XI: పాకిస్థాన్ తన తొలి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో టీమ్ ఇండియాకు ఇదే తొలి సూపర్-4 మ్యాచ్. ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. పల్లెకెలె మైదానంలో జరగాల్సిన ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Asia cup 2023 India vs Pakistan Super Fours: ఆసియా కప్-2023 సూపర్-4 దశ మూడో మ్యాచ్ ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతుంది. ఈమేరకు టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది.
భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించారు. మహ్మద్ షమీ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఆడాడు.
ప్రస్తుతం కొలంబోలో ఉదయం నుంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ సూచన.
పాకిస్థాన్ తన తొలి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో టీమ్ ఇండియాకు ఇదే తొలి సూపర్-4 మ్యాచ్. ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. పల్లెకెలె మైదానంలో జరగాల్సిన ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఇరుజట్లు:
🚨 Toss & Team News 🚨
Pakistan have elected to bowl against #TeamIndia.
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/fkABP5uWxr
— BCCI (@BCCI) September 10, 2023
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్ ప్లేయింగ్ 11
Asia Cup 2023. Pakistan XI: F Zaman, Imam Ul Haq, B Azam (C), M Rizwan (WK), A Salman, I Ahmed, S Khan, F Ashraf, N Shah, S Afridi, H Rauf. https://t.co/kg7Sh2t5pM #INDvPAK
— BCCI (@BCCI) September 10, 2023
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




