BAN Vs PAK: రెండో టెస్ట్‌లో గెలిచిన పాక్.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..
బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది...
బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్, ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 4-86తో రాణించాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఢాకాలో వర్షం కారణంగా మొదటి రోజు మూడో సెషన్ వాష్ అవుట్ కావడం, 2వ రోజు 6.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడంతో పాటు 3వ రోజు ఎలాంటి ఆట సాధ్యం కాకపోవడంతో పాకిస్తాన్ విజయం సందేహం మొదలైంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి డిక్లెర్ చేసింది. బాబర్ అజం 76, అజర్ అలీ 56, అలమ్ 50 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులే అలౌట్ అయింది. దీంతో పాలోవన్ అడాల్సి వచ్చింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు అలౌట్ అయింది. షకీబ్ అల్ హసన్ 63 పరుగులు చేశాడు. తొలి టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Bangladesh fight back but Pakistan persist!
The visitors win the second Test by an innings and 8 runs to take the series 2-0 ?#WTC23 | #BANvPAK | https://t.co/sUmFzGtpnF pic.twitter.com/nIMqX3Jeiv
— ICC (@ICC) December 8, 2021
Read Also.. Rohit Sharma: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్ట్ జట్టు ఎంపిక..