Video: డబ్బులు లేక, 8 నెలలుగా కూతురిని స్కూల్‌కి పంపలేదు.. దీన స్థితిలో బాబర్ ఆజం సోదరుడు..

Umar Akmal Crying Over His Financial Problem: బాబర్ అజామ్ బంధువు ఉమర్ అక్మల్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తన కూతురిని స్కూల్‌కి కూడా పంపలేకపోయానంటూ ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాధపడ్డాడు. పాకిస్తాన్ తరపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఉమర్, కొన్ని తప్పులు చేయడంతో తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.

Video: డబ్బులు లేక, 8 నెలలుగా కూతురిని స్కూల్‌కి పంపలేదు.. దీన స్థితిలో బాబర్ ఆజం సోదరుడు..
Umar Akmal Financial Proble

Updated on: Mar 05, 2025 | 8:56 PM

Umar Akmal Crying Over His Financial Problem: ఒక వైపు, క్రికెట్ ఆటగాళ్ళు ఒక మ్యాచ్, టోర్నమెంట్ నుంచి లక్షలు, కోట్లు సంపాదిస్తుంటారు. మరోవైపు, పాకిస్తాన్ తరపున అనేక మ్యాచ్‌లను గెలిచిన ఆటగాడు మాత్రం.. ఎవరూ ఊహించలేని విధంగా అత్యంత దయనీయమైన స్థితిలో నిలిచాడు. ఈ ఆటగాడు మరెవరో కాదు ఉమర్ అక్మల్. పాకిస్తాన్ తరపున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఉమర్ అక్మల్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ.. తన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తన కూతురిని స్కూల్‌కి పంపించడానికి కూడా తన దగ్గర డబ్బు లేదని చెప్పుకొచ్చాడు.

ఉమర్ అక్మల్ ఏమన్నాడంటే..

టాక్ షోలో ఉమర్ అక్మల్ మాట్లాడుతూ, ‘మెక్‌డొనాల్డ్స్‌లో నా కూతురిని తినిపించేత డబ్బు నా దగ్గర లేదు. నేను చాలా నిజాయితీగా ఈ విషయం చెబుతున్నాను. ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బు లేకపోవడంతో నేను నా కూతురిని 8 నెలలుగా స్కూల్‌కి పంపలేదు. నా కుటుంబంలో ఎవరూ నాకు మద్దతు ఇవ్వలేదని, కష్ట సమయాల్లో నా భార్య మాత్రమే నాకు అండగా నిలిచిందని ఉమర్ అక్మల్ భావోద్వేగం చెందాడు. ‘నా భార్య నాకు ప్రాణ స్నేహితురాలు. ఏది ఏమైనా, నేను మీతోనే నిలబడతాను’ అంటూ నాకు ధైర్యం చెప్పిందంటూ ఉద్వేగం చెందాడు.

ఉమర్ బాబర్ ఆజం బంధువు..

ఉమర్ అక్మల్‌ను పాకిస్తాన్‌లో సూపర్‌స్టార్‌గా పరిగణించేవారు. కానీ, కొన్ని తప్పుల కారణంగా అతని కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. ఉమర్ అక్మల్, బాబర్ ఆజం ఇద్దరూ బంధువులు. బాబర్ క్రికెట్ ప్రాథమికాలను నేర్చుకుంటున్నప్పుడు, ఉమర్ అక్మల్ పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్. కానీ, బాబర్ తనకు ఏమాత్రం సహాయం చేయలేదని ఉమర్ అక్మల్ ఇటీవల ఆరోపించాడు. తనకు ఇష్టమైన అబ్బాయిలను ఆడించేవాడని, పాకిస్తాన్ బెంచ్ స్ట్రెంత్‌ను పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించాడు.

ఉమర్ అక్మల్ కెరీర్..

ఉమర్ అక్మల్ పాకిస్తాన్ తరపున 16 టెస్టుల్లో 35 కంటే ఎక్కువ సగటుతో 1003 పరుగులు చేశాడు. వన్డేల్లో, అతను 121 మ్యాచ్‌ల్లో 3194 పరుగులు చేశాడు. అందులో అతను 2 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఆటగాడు టీ20లో 26 సగటుతో 1690 పరుగులు కూడా చేశాడు. ఉమర్ అక్మల్ తన కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు సాధించాడు. అక్మల్ గత 6 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. అతను తన చివరి మ్యాచ్‌ను 2019లో ఆడాడు. ఈ ఆటగాడు కేవలం 28 సంవత్సరాల వయసులో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..