Pakistan Cup: మాటల్లేవ్.. దంచుడే దంచుడు.. 23 సిక్స్‌లు, 44 ఫోర్లు, 645 రన్స్.. పరుగుల ప్రళయమే..

|

Dec 13, 2022 | 1:56 PM

పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ టీమ్ తన సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచుల్లో సిరీస్‌ల మీద సిరీస్‌లు కోల్పోతుంటే.. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లో ఆ దేశ యువ ఆటగాళ్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. పరుగుల ప్రళయం సృష్టిస్తున్నారు.

Pakistan Cup: మాటల్లేవ్.. దంచుడే దంచుడు.. 23 సిక్స్‌లు, 44 ఫోర్లు, 645 రన్స్.. పరుగుల ప్రళయమే..
Pakistan Cup 2022
Follow us on

పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ టీమ్ తన సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచుల్లో సిరీస్‌ల మీద సిరీస్‌లు కోల్పోతుంటే.. మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌లో ఆ దేశ యువ ఆటగాళ్లు సంచలనాలు సృష్టిస్తున్నారు. పరుగుల ప్రళయం సృష్టిస్తున్నారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్స్ 645 పరుగులు చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్‌ కప్ టోర్నమెంట్‌‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో వండర్ క్రియేట్ చేశారు బ్యాటర్స్. కరాచీ వేదికగా జరిగిన ఒక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ పంజాబ్ 359 పరుగులకు ఆలౌటైంది. 360 పరుగుల లక్ష్యంలో రంగంలోకి నార్తర్న్ (పాకిస్తాన్) టీమ్ 286 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్స్ మొత్తం 23 సిక్సర్లు, 44 ఫోర్లు కొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ పంజాబ్ బ్యాటర్స్.. అద్భుతంగా రాణించారు. ఓపెనర్ టైబ్ తాహిర్ 96 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ముహమ్మద్ ఫైజాన్ 50 పరుగులు చేశాడు. ఫామ్‌లో లేకపోవడంతో పాక్ నేషనల్ టీమ్‌లో చోటు కోల్పోయిన అహ్మద్ షాజాద్ ఈ ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేశాడు. కాసిమ్ అక్రమ్ 67 పరుగులతో చెలరేగిపోయాడు. ఇలా సెంట్రల్ పంజాబ్ టీమ్ మొత్తం నాలుగు అర్ధ సెంచరీలు చేసింది.

ఇవి కూడా చదవండి

హైదర్ అలీ కృషి విఫలం..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్లాప్ అని నిరూపించుకున్న హైదర్ అలీ నార్తర్న్ (పంజాబ్) తరఫున అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో 55 పరుగులు చేశాడు. కానీ ఈ జట్టులో మరే ఇతర బ్యాట్స్‌మెన్ 50కి మించి పరుగులు చేయలేదు. ముబాసిర్ ఖాన్ 44, మెహ్రాన్ ముంతాజ్ 45 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ పంజాబ్ 73 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ట్రోఫీలో అగ్రస్థానంలో నిలిచింది.

23 సిక్సర్లు, 44 ఫోర్లు 645 రన్స్..

ఈ మ్యా్చ్ మొత్తంగా ఇరు జట్లు బ్యాటర్స్ రెచ్చిపోయారు. తగ్గేదే లే అన్నట్లుగా.. మొత్తం 23 సిక్సర్లు, 44 ఫోర్లతో వీరంగం సృష్టించారు. మొత్తంగా ఈ మ్యా్చ్‌లో ఇరు జట్లు కలిసి 645 పరుగులు నమోదు చేశాయి.

ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌ టీమ్‌ల విజయం..

పాకిస్తాన్ కప్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ టీమ్‌లు కూడా భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఖైబర్ 6 వికెట్ల తేడాతో సదరన్ పంజాబ్‌పై విజయం సాధించింది. సదరన్ పంజాబ్ జట్టు కేవలం 182 పరుగులకే కుప్పకూలగా.. ఖైబర్ 38.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఖైబర్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ గులామ్ 98 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

సింధు టీమ్ కూడా 4 పరుగుల తేడాతో బలూచిస్థాన్ చేతిలో ఓడిపోయింది. 46-46 ఓవర్ల ఈ మ్యాచ్‌లో సింధు 288 పరుగులు చేయగా, డక్‌వర్త్ లూయిస్ నియమావళి ప్రకారం బలూచ్ జట్టు 251 పరుగుల లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది. అలీ వకాస్ అజేయంగా 121 పరుగులు చేసి బలూచిస్థాన్‌కు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..