ఈ మ్యాచ్ జీవితంలో మర్చిపోలేను – సర్ఫరాజ్

ప్రపంచకప్ 2019లో భాగంగా శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా పాకిస్థాన్, విండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ పేకమేడలా 105 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. మెగా టోర్నీలో జరిగిన ఈ రెండో మ్యాచ్ రికార్డు స్థాయిలో మూడు గంటల్లోనే ముగిసింది. ఇది ఇలా ఉండగా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ […]

ఈ మ్యాచ్ జీవితంలో మర్చిపోలేను - సర్ఫరాజ్
Follow us

|

Updated on: Jun 01, 2019 | 1:05 PM

ప్రపంచకప్ 2019లో భాగంగా శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా పాకిస్థాన్, విండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ పేకమేడలా 105 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. మెగా టోర్నీలో జరిగిన ఈ రెండో మ్యాచ్ రికార్డు స్థాయిలో మూడు గంటల్లోనే ముగిసింది.

ఇది ఇలా ఉండగా మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ‘ఈ మ్యాచ్‌ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇలాంటి మెగా టోర్నీలో ప్రారంభ మ్యాచ్‌లో ఎంత బాగా ఆడితే అంత ఆత్మవిశ్వాసం వస్తుందని.. కానీ ఈ విషయంలో మేము విఫలమయ్యాం’ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.