IPL 2024: చెన్నై, లక్నో జట్లకు బ్యాడ్ న్యూస్.. గాయాలతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్.. చెదిరిన ప్లేఆఫ్‌ల కల

Deepak Chahar and Mayank Yadav Injury Update: ఐపీఎల్ 2024 (IPL 2024) లో ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి మ్యాచ్‌తో ప్లేఆఫ్‌ల చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లకు శుభవార్త అందడం లేదు.

IPL 2024: చెన్నై, లక్నో జట్లకు బ్యాడ్ న్యూస్.. గాయాలతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్.. చెదిరిన ప్లేఆఫ్‌ల కల
Csk And Lsg Teams
Follow us

|

Updated on: May 04, 2024 | 1:38 PM

Deepak Chahar and Mayank Yadav Injury Update: ఐపీఎల్ 2024 (IPL 2024) లో ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి మ్యాచ్‌తో ప్లేఆఫ్‌ల చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లకు శుభవార్త అందడం లేదు. ఈ జట్లలో ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, మయాంక్ యాదవ్ గాయం కారణంగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు వారు రాబోయే మ్యాచ్‌లలో ఆడటం కష్టం. ప్లేఆఫ్‌కు ముందు ఈ ఇద్దరు బౌలర్లు గాయపడటం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో జట్లకు కష్టాలను పెంచింది.

దీపక్ చాహర్ గురించి మాట్లాడితే, అతను పంజాబ్ కింగ్స్‌తో చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు వేసిన తర్వాత గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి తిరిగి రాలేదు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ దీపక్ చాహర్ గాయానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. దీపక్ చాహర్ గాయం ఫర్వాలేదనిపిస్తోంది. అతను ఈ సీజన్‌లో లేడని నేను చెప్పడం లేదు. కానీ, ఇప్పుడు ఆడడం అతనికి కష్టం. అతను తదుపరి మ్యాచ్ కోసం జట్టుతో ధర్మశాలకు వెళ్లలేదు. చెన్నైలో మాత్రమే ఉన్నాడు. అతని మెడికల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

మయాంక్ యాదవ్ గురించి చెప్పాలంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కూడా గాయానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను లక్నోకు అందించాడు. ఈ ఓవర్ తొలి బంతికే ముంబై బ్యాట్స్‌మెన్ మహ్మద్ నబీకి పెవిలియన్ దారి చూపించాడు. అయితే, వికెట్‌ తీసిన తర్వాత మయాంక్‌ బాగోకపోవడంతో మళ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లిపోయాడు.

మయాంక్ యాదవ్ తుంటి వాపు కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ తరపున చివరి 5 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోలుకున్న తర్వాత తిరిగి వచ్చిన అతను మరోసారి గాయానికి గురయ్యాడు.

CSK, LSGకి భారీ నష్టం..

దీపక్ చాహర్, మయాంక్ యాదవ్ గాయం కారణంగా, చెన్నై, లక్నో జట్లు రెండూ చాలా నష్టపోవచ్చు. వీరిద్దరూ జట్టుకు ప్రధాన బౌలర్లు కావడంతో వీరిద్దరూ నిష్క్రమించడం జట్టుకు పెద్ద దెబ్బే. చెన్నై, లక్నో జట్లు రెండూ ఇంకా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. తదుపరి కొన్ని మ్యాచ్‌లు వారికి చాలా ముఖ్యమైనవి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles