T20 World Cup 2024: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్ శర్మ.. కీలక అప్‌డేట్ ఇచ్చిన పీయూష్ చావ్లా

IPL 2024 లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం అద్భుతమైన మ్యాచ్ జరిగింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను సులువుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ ప్రత్యేకంగా ఏమీ చేయలేక 11 పరుగులకే ఆలౌటయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫ్లాప్‌గా మారాడు.

T20 World Cup 2024: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్ శర్మ.. కీలక అప్‌డేట్ ఇచ్చిన పీయూష్ చావ్లా
Rohit Sharma
Follow us

|

Updated on: May 04, 2024 | 3:20 PM

Rohit Sharma Injury Update: T20 ప్రపంచ కప్ 2024కి ముందు భారత జట్టుకు ఎలాంటి శుభవార్త రావడం లేదు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయానికి గురయ్యాడు. అతని గాయం చాలా తీవ్రంగా లేనప్పటికీ.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ వెన్నుముకతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా అతను ముందుజాగ్రత్తగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయలేదు.

నిజానికి, ముంబై ఇండియన్స్ జట్టు KKRతో వాంఖడే స్టేడియంలో ఆడటానికి వచ్చినప్పుడు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడని, అతను ఫీల్డింగ్ చేయడం లేదని తెలిపాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు ఆడుతున్నాడో ఎవరికీ తెలియదు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అందరి మదిలో అనేక ప్రశ్నలు వచ్చాయి.

రోహిత్ శర్మ గాయంపై పీయూష్ చావ్లా అప్‌డేట్..

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ప్రముఖ స్పిన్ బౌలర్ పీయూష్ చావ్లా దీని వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ కొంత గాయంతో ఇబ్బంది పడుతున్నాడని పీయూష్ చావ్లా అన్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు, రోహిత్ శర్మ వెన్నులో సమస్య ఉందని, అందుకే మేనేజ్‌మెంట్ ముందుజాగ్రత్తగా అతనిని ఫీల్డింగ్ చేయనివ్వలేదు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ శర్మ అత్యంత కీలకమైన ఆటగాడు. ఇటువంటి పరిస్థితిలో హిట్ మ్యాన్ పూర్తిగా ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. భవిష్యత్తులో అతని గాయం మరింత తీవ్రమైతే, అది భారత జట్టుకు, అభిమానులకు పెద్ద దెబ్బగా మారనుంది. రోహిత్ శర్మ నిరంతరం క్రికెట్ ఆడుతున్నందున అతను సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు.

IPL 2024 లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం అద్భుతమైన మ్యాచ్ జరిగింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను సులువుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ ప్రత్యేకంగా ఏమీ చేయలేక 11 పరుగులకే ఆలౌటయ్యాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫ్లాప్‌గా మారాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్