ANIL KUMAR

ఏంటి.! ఈ అమ్మడు యాత్ర 2 హీరోయినా.? ఈ రేంజ్ లో ఉందేంటి..!

04 May 2024

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా నడుస్తుంది.. ఏ కొత్త హీరోయిన్ వచ్చిన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

అందులో మలయాళ ముద్దుగుమ్మ కేతకి నారాయణ్‌ ఒకరు.. ఈమెను కూడా టాలీవుడ్ మూవీ లవర్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు.

హిందీ, మరాఠీ సినిమాలతో పాటు పలు భాషల్లో కూడా నటించి తనదైన నటన , అందంతో మెప్పించింది ఈ కేతకి నారాయణ్‌.

ఇంతకీ ఈ కేతకి నారాయణ్‌ ఎవరు అనేగా మీ సందేహం.. అదేనండీ యాత్ర 2 మూవీలో వైఎస్‌ భారతి పాత్రతో ఆకట్టుకుంది కదా..

ఆ సినిమా కంటే ముందు జగపతి బాబు నటించిన ‘FCUK.. చిట్టి ఉమా కార్తీక్‌’ అనే ఓ తెలుగు సినిమాలోనూ నటించింది.

అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కేతకికి గుర్తింపు రాలేదు. తరువాత యాత్ర 2లో తన అదృష్టం పరీక్షించుకుంది.

ఇతర భాషల్లో 83,అవియాల్,విచిత్రం, సమైరా.. ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చాయి. ఇక ఈ అమ్మడి ఇంస్టా ఫాలోయింగ్ బానే ఉంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అందల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సొగసరి భామ కేతకి నారాయణ్‌.