AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SA : ఇక డ్రామా చేస్తాడు చూడు.. మైక్ ఆఫ్ చేయకుండా బాబర్ అజామ్‌ను తిట్టిన మాజీ కెప్టెన్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా మధ్య గడ్డాఫీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా కామెంటరీ ఇస్తున్న రమీజ్ రాజా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ గురించి అనుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

PAK vs SA : ఇక డ్రామా చేస్తాడు చూడు.. మైక్ ఆఫ్ చేయకుండా బాబర్ అజామ్‌ను తిట్టిన మాజీ కెప్టెన్
Pak Vs Sa (1)
Rakesh
|

Updated on: Oct 13, 2025 | 9:58 AM

Share

PAK vs SA : పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా కామెంటరీ చేస్తుండగా, కెప్టెన్ బాబర్ అజామ్ గురించి అనుకోని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. బాబర్ అజామ్ ఔటైనట్టు అంపైర్ ప్రకటించిన సమయంలో మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయిన రమీజ్ రాజా.. బాబర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ గడ్డాఫీ స్టేడియంలో జరుగుతోంది. మొదటి రోజు పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49వ ఓవర్ మొదటి బంతిని బాబర్ అజామ్ డిఫెన్స్ చేయబోయారు. బంతి బ్యాట్‌కు తగలకుండా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు చేసిన అప్పీల్‌ను అంపైర్ అంగీకరించి ఔట్ ప్రకటించారు. వెంటనే బాబర్ అజామ్ డీఆర్‌ఎస్ కోరారు. సరిగ్గా అదే సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న రమీజ్ రాజా తమ మైక్‌ను ఆఫ్ చేయడం మర్చిపోయారు. “ఇది ఔటే డ్రామా చేస్తాడు చూడు” అని బాబర్‌ను ఉద్దేశిస్తూ రమీజ్ రాజా అనడం లైవ్‌లో అందరికీ వినిపించింది.

రమీజ్ రాజా డ్రామా అని కామెంట్ చేసిన కొద్దిసేపటికే రీప్లేలు చూపించారు. బంతికి, బ్యాట్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో, అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని బాబర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అయితే, మైక్‌లో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యల వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఒక మాజీ కెప్టెన్, కామెంటేటర్ హోదాలో ఉండి మరో ప్రస్తుత కెప్టెన్‌పై ఇలా మాట్లాడటంపై పాకిస్తాన్ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

బాబర్ అజామ్ ఈ మ్యాచ్‌లో కూడా తన పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు. అతను 48 బంతుల్లో 4 ఫోర్లతో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి సైమన్ హార్మర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఒకానొక దశలో అబ్దుల్లా షఫీక్ ఔటైన తర్వాత ఇమామ్ ఉల్ హక్ (93), షాన్ మసూద్ (76) అద్భుతమైన 161 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్తాన్ స్కోరు 163/1 వద్ద బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాత వికెట్ల పతనం మొదలైంది. షాన్ మసూద్ ఔటవగా, ఇమామ్ ఉల్ హక్ 199 వద్ద, బాబర్ అజామ్ 199 వద్ద ఔటయ్యారు.

టాప్ ఆర్డర్ త్వరగా కూలిపోయినా, మహ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అలీ ఆగా (52) హాఫ్ సెంచరీలతో నిలబడ్డారు. వీరిద్దరూ కలిసి కీలకమైన శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. అయినప్పటికీ, రమీజ్ రాజా వ్యాఖ్యలు ప్రస్తుతం మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..