Road Safety: రోడ్ సేఫ్టీపై క్రికెట్ దిగ్గజాల ప్రకటన.. వీడియో వైరల్ కావడంపై స్పందించిన యువరాజ్ సింగ్

| Edited By: Ravi Kiran

Mar 22, 2021 | 7:21 AM

క్రికెట్ దేవుడు సచిన్ చెబితే ప్రపంచం సాహో అంటుంది.. ఇక మరో దిగ్గజం బ్రియాన్ లారా కూడా అంతే. రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో భాగంగా చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఫీల్డ్‌లో క‌లిసి ఆడిన...

Road Safety: రోడ్ సేఫ్టీపై క్రికెట్ దిగ్గజాల ప్రకటన.. వీడియో వైరల్ కావడంపై స్పందించిన యువరాజ్ సింగ్
Sachin Tendulkar, Brian Lara Min
Follow us on

సమస్య మాత్రం ఒక్కటే.. సామధానం కూడా ఒక్కటే.. ఎక్కడనా ప్రమాదాలు కామన్.. వీటిని నివారించేందుకు ఇద్ద‌రు క్రికెట్ లెజెండ‌రీలు చేతులు క‌లిపారు. రోడ్డు భ‌ద్ర‌త గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ ప్రయత్నం చేశారు.

క్రికెట్ దేవుడు సచిన్ చెబితే ప్రపంచం సాహో అంటుంది.. ఇక మరో దిగ్గజం బ్రియాన్ లారా కూడా అంతే. రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో భాగంగా చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఫీల్డ్‌లో క‌లిసి ఆడిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, విండీస్ దిగ్గ‌జ ఆటగాడు బ్రియాన్ లారా ఈ రోడ్డు భ‌ద్ర‌త గురించి ఓ మెసెజ్ ఇచ్చారు.

వీరిద్దరు కలిసి నటించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైర‌ల్ అవుతోంది. ఈ 49 సెక‌న్ల వీడియోలో హెల్మెట్ ధ‌రించ‌డం ఎంత ముఖ్య‌మో వివ‌రించాడు స‌చిన్ టెండూల్క‌ర్‌. క్రికెట్ ఫీల్డ్‌లో అయినా, బండి న‌డిపేట‌ప్పుడు అయినా హెల్మెట్ క‌చ్చితంగా ధరించాల‌ని స‌చిన్ పిలుపునిచ్చాడు.

ఈ సందేశాన్ని చేర‌వేయ‌డంలో సాయం చేసిన లారాకు మాస్ట‌ర్  థ్యాంక్స్ కూడా చెప్పాడు. ఈ వీడియోను స‌చిన్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయ‌గా.. ఆస్కార్ నామినేష‌న్ అంటూ కామెంట్ జోడిస్తూ దానిని యువ‌రాజ్‌సింగ్ రీట్వీట్ చేశాడు.

రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్లో ఇండియా లెజెండ్స్‌.. శ్రీలంక లెజెండ్స్‌తో దూకుడుగా ఆడింది. హైఓల్టేజ్ సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌ను ఇండియ‌న్ లెజెండ్స్ ఓడించారు. ఆ మ్యాచ్‌లో స‌చిన్‌, లారా ఆట అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది

ఇవి కూడా చదవండి:

టోక్యో ఒలింపిక్స్‌లోకి తొలిసారి టీటీ.. ఈజీగా మెడల్ గెలుస్తామంటున్న మిక్స్‌డ్ జోడీ