IND vs WI: ఆ ఆటగాడికి 10 రేటింగ్ ఇచ్చిన సునీల్ గవాస్కర్.. అతడు ఎవరంటే..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించంది...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించంది. ఈ వన్డేతోనే టీమ్ ఇండియా వైట్-బాల్ కెప్టెన్‌గా పూర్తి స్థాయి తన పదవీకాలాన్ని ప్రారంభించాడు రోహిత్ శర్మ.
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఇండియా 178 పరుగులు చేసింది. మాజీ భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ప్రదర్శనకు “10 మార్కుల” రేటింగ్ ఇచ్చాడు. గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ “ఇది అతను కోరుకున్న పర్ఫెక్ట్ స్టార్ట్. స్కోరింగ్ పరంగా ప్రత్యేకత ఏమిటంటే, అది బ్యాటింగ్.” అని చెప్పాడు. ” ఈ మ్యాచ్‌లో ప్రతిదీ సరిగ్గా చేశారు. కాబట్టి మీరు నన్ను 10 మార్కులతో రేటింగ్ అడిగితే, నేను అతనికి 9.99 ఇస్తానని నేను భావిస్తున్నాను” అని పేర్కొన్నాడు.
టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్‌ను 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జేసన్ హోల్డర్ 71 బంతుల్లో 57 పరుగులు చేసి కరేబియన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో ఛేజింగ్‌లో రోహిత్ 51 బంతుల్లో 60 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.
Read Also.. IPL 2022 Auction: ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్‌సీబీ.. రూ. 27 కోట్లతో దక్కించుకునేందుకు భారీ స్కెచ్..!