Cricket: 27 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత.. డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. వన్డేల్లో సంచలనం!

పట్టుమని పాతికేళ్లు లేవు.. డొమెస్టిక్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదేశాడు.. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.. అతడెవరో తెలుసా.?

Cricket: 27 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత..  డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. వన్డేల్లో సంచలనం!
Royal London Cup
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 07, 2022 | 4:35 PM

6,6,6… 4,4,4.. ఈ బ్యాటర్‌కు పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. వన్డేల్లో సంచలన స్కోర్ నమోదు చేశాడు. బౌండరీలతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి.. రోహిత్ శర్మ సరసన చోటు సంపాదించాడు. ఇంతకీ అతడెవరు.? ఏ టీంపై నమోదు చేశాడు.? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఇటీవల వోర్సెస్టర్‌షైర్, కెంట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వోర్సెస్టర్‌షైర్ టీం.. నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కషిఫ్ అలీ(114) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బర్నార్డ్(79), వికెట్ కీపర్ బెన్ కాక్స్(59) అర్ధ సెంచరీలతో అతడికి సాయపడ్డారు. వీరు ముగ్గురూ కూడా స్కోర్‌బోర్డుపై వేగంగా పరుగులు జోడించడంతో.. ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.

అనంతరం భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన కెంట్ జట్టుకు.. ఓపెనర్ బెన్ కాంప్టన్(75) మంచి శుభారంభాన్ని అందించగా.. వన్ డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఒలివర్ రాబిన్‌సన్(206) డబుల్ హండ్రడ్‌తో చెలరేగి ఆడాడు. రాబిన్‌సన్ క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే హిట్టింగ్ మొదలుపెట్టాడు. 131 బంతులు ఎదుర్కున్న రాబిన్‌సన్.. 27 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 206 పరుగులు సాధించాడు. అతడు బౌండరీల రూపంలో 33 బంతుల్లో 144 పరుగులు రాబట్టడం విశేషం. ఇక రాబిన్‌సన్ విధ్వంసానికి కెంట్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 353 పరుగులు సాధించింది. కాగా, రాబిన్‌సన్ డబుల్ సెంచరీ చేసింది డొమెస్టిక్ క్రికెట్‌లో అయినప్పటికీ.. వన్డేల్లో 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన క్లబ్‌లో చేరాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు