IND vs AUS, CWG 2022: ‘బంగారు’ పోరులో భారత్ గెలిచేనా.. ఆస్ట్రేలియాతో ఫైనల్ సమరానికి సిద్ధం..

CWG 2022 Cricket: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండూ తమ పతకాలను ఖాయం చేసుకున్నాయి. కానీ, ఈ రోజు వాటి రంగు ఏంటో తెలనుంది. ఫైనల్ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

IND vs AUS, CWG 2022: 'బంగారు' పోరులో భారత్ గెలిచేనా.. ఆస్ట్రేలియాతో ఫైనల్ సమరానికి సిద్ధం..
Ind Vs Aus, Cwg 2022 Final
Follow us
Venkata Chari

|

Updated on: Aug 07, 2022 | 2:37 PM

కామన్వెల్త్ గేమ్స్ 2022 క్రికెట్ ఈవెంట్‌లో కథ ఎక్కడ మొదలైందో అదే మ్యాచ్‌తో ముగియనుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌తో కామన్వెల్త్‌లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. కాగా ఇప్పుడు అదే రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 9.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు దేశాలకు క్రికెట్‌లో పతకాలు ఖాయమయ్యాయి. కానీ ఈ రోజు ఆ పతకాల రంగు ఏదో తెలియనుంది. స్వర్ణం, రజతం ఎవరు గెలుస్తారో తెలియనుంది.

ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 4 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, రెండో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా ఈ స్థానాన్ని సాధించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే పోరుతో స్వర్ణం, రజతాలను నిర్ణయించే క్రికెట్ ఈవెంట్‌లో కాంస్య పతక పోరు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లో జరగనుంది.

తొలి మ్యాచ్ ఆడిన జట్లే.. ఫైనల్ ఆడేది..

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అందులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇప్పుడు ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆ ఓటమిని సమం చేసే గొప్ప అవకాశం భారత మహిళా క్రికెట్ జట్టుకు వచ్చింది. ఆస్ట్రేలియాను ఓడిస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ కో బంగారు పతకం దక్కించుకోనుంది.

స్వర్ణం గెలవాలంటే ఆస్ట్రేలియా ‘క్లీన్ బోల్డ్’ కావాలి..

ఆస్ట్రేలియాతో జరిగిన భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్రను పరిశీలిస్తే.. ఎక్కడా నిలబడలేదు. టీ20ల్లో ఆడిన చివరి 5 మ్యాచ్‌ల్లో, భారత జట్టు 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో ఇరు జట్లు మొత్తం 24 సార్లు తలపడగా, ఇందులో భారత జట్టు 6 సార్లు మాత్రమే గెలవగలిగింది. అంటే 17 సార్లు ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి, తిరుగులేని రికార్డుతో దూసుకపోతోంది.

ఈరోజు గోల్డ్ మెడల్ కోసం జరగనున్న మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయ శాతం 100 శాతంగా నిలిచింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇంగ్లండ్‌లో భారత్‌తో 2 టీ20 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. అంటే గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ అన్ని రంగాల్లో సత్తా చూపడంతోపాటు, చెమటోడ్చాల్సి ఉంటుంది.