భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మెగా టోర్నీ షెడ్యూల్ రాకముందు నుంచే దీనిపై చర్చ సాగినా.. షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇదే తంతు అన్నవిధంగా ఉంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తీరు. వన్డే వరల్డ్‌కప్ కోసం ఐసీసీ షెడ్యూల్ ప్రకటించిన రోజే.. ‘భారత్‌లో మా పర్యటనపై మా ప్రభుత్వందే తుది నిర్ణయం’ అని తెలిపింది పాక్ బోర్డ్. ఇంతకాలం చర్చించుకుని ఇప్పుడు ‘భారత్‌లో మా ప్లేయర్ల భద్రతపై రాతపూర్వక హామీ ఇస్తేనే మేము వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంటాం’ అంటూ ఐసీసీకి లేఖ రాసింది పాక్ క్రికెట్ బోర్డ్, ఇంకా ఆ దేశ ప్రభుత్వం. ఇదంతా శుక్రవారం జరిగిన తంతు అయిన నేపథ్యంలో.. పాక్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డ్ సంయుక్తంగా రాసిన లేఖపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
అయితే వన్డే ప్రపంచకప్ తెరమీదకు వచ్చిననాటి నుంచి కూడా పాక్ ఏదో ఒక కారణం చెబుతూనే ఉంది. మొదట గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌కి వేదిక మార్చాలంటూ మొండిపట్టు పట్టింది. బీసీసీఐ ముందు తన పప్పులు ఉడకకపోవడంతో అది వదిలేసింది. ఇదిలా ఉండగా పాకిస్థాన్ ప్రపంచకప్ టోర్నీలో ఆడకపోతే రానున్న కాలంలో తనకే నష్టం తప్ప.. భారత్‌కి కానీ, ఐసీసీకి కానీ ఎలాంటి నష్టం లేదు. పైగా పాకిస్థాన్‌కి కలిగే నష్టం వందల కోట్ల రూపాయల్లోనే ఉండడం గమనార్హం.
Pakistan Government and PCB have asked the ICC to give written assurance about Pakistan team’s security in India for 2023 World Cup. pic.twitter.com/m1ZQI8S0GK
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2023
మరోవైపు అక్టోబర్ 15న భారత్, పాకిస్తాన్ మధ్య నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. అక్టోబర్ 15 దేవీ నవరాత్రల్లోని మొదటి రోజు అయినందున.. ఆ మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకులపై నవరాత్రుల ప్రభావం పడే అవకాశం ఉన్నందును మ్యాచ్ తేదీని 14వ రోజుకు మార్చారు. ఇక వన్డే ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఆసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ సహా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా వంటి దేశాలు పాల్గొనున్నాయి. అలాగే వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో.. చివరిటోర్నీ రన్నరప్ అయిన న్యూజిలాండ్ అక్టొబర్ 5న తలపడనుంది.