Virat Kohli Coments : ఓపెనింగ్ కాంబినేషన్‌పై విరాట్ సంచలన ప్రకటన.. టీ 20 ప్రపంచ కప్ గురించి ఏం చెప్పాడంటే..?
Virat Kohli Coments : ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో విరాట్ అనూహ్యంగా రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.
Virat Kohli Coments : ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20లో విరాట్ అనూహ్యంగా రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యూహాత్మక చర్య ఫలించడమే కాకుండా జట్టుకు కొత్త భరోసానిచ్చింది. మరోవైపు కెప్టెన్ కోహ్లీ సైతం భవిష్యత్‌లో హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఇప్పుడు ఈ విషయంపై మరింత చర్చ మొదలైంది.
మైదానంలో ఆడే ఆటగాళ్ల ఎంపికలో సెలక్టర్ల పాత్ర ఉండదని విరాట్ అన్నాడు. రోహిత్‌తో బ్యాటింగ్ ఒక వ్యూహాత్మకమైన చర్యగా భావించాడు. మేము కలిసి బ్యాటింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలను కనుగొన్నామని గుర్తుచేశాడు. ఇది భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పలేనని విరాట్ చెప్పాడు. సూర్యకుమార్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు. సూర్య వంటి వ్యక్తి కోసం ఏ విధమైన పాత్రను పోషించడానికి తాను సిద్ధంగా ఉంటానని తెలిపాడు.
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ టి 20 ఎలెవెన్‌లో స్థానం కోల్పోయాడని, అయితే మంగళవారం జరిగే తొలి వన్డేలో రోహిత్‌తో ఓపెనింగ్ చేస్తానని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ సిరీస్.. టీ 20 ప్రపంచ కప్‌కు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా.. సూర్యకుమార్, ఇషాన్‌కిషన్ లాంటి ఇద్దరు ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరూ సత్తా చాటి భవిష్యత్ ఆశాకిరణాలుగా నిలిచారు. మున్ముందు కూడా వారిద్దరు ఇలాగే ఆడితే, కోహ్లీ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.