AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బాబోయ్.. ఇకపై ఆ టెస్టులు మాకొద్దు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం..

Pink Ball Test: ఇప్పటివరకు పింక్ బాల్‌తో ఆడిన అన్ని టెస్టులు కేవలం 2-3 రోజుల్లోనే ముగిశాయి. ప్రజలు 4 నుంచి 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. కానీ, అది త్వరగా ముగిసిపోవడంతో.. పింక్ బాల్ టెస్టులపై ఆసక్తి లేకుండాపోతోంది. దీంతో భారత్‌లో దీన్ని నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ చేసిన ఈ ప్రకటన తర్వాత టీమ్‌ఇండియా పింక్‌ బాల్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడడం అనుమానంగా మారింది. ప్రస్తుతం భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ డిసెంబర్ 26 నుంచి 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్టులు ఎర్ర బంతితో నిర్వహించనున్నారు.

Team India: బాబోయ్.. ఇకపై ఆ టెస్టులు మాకొద్దు.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం..
Pink Ball Test
Venkata Chari
|

Updated on: Dec 11, 2023 | 1:15 PM

Share

Day-Night Test: ఇకపై భారత్‌లో డే-నైట్ టెస్టు మ్యాచ్‌లు జరగడం అనుమానమే. పింక్ బాల్‌తో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడడం మనకు తెలిసిందే. ఇకపై ఈ మ్యాచ్‌లను భారత మైదానంలో నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. BCCI ఇకపై డొమెస్టిక్ సీజన్‌లో పురుషుల క్రికెట్ లేదా మహిళల ఈవెంట్‌లలో డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించదు. పింక్ బాల్ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

నివేదిక ప్రకారం, బీసీసీఐ సెక్రటరీ జైషా విలేకరులతో మాట్లాడుతూ పింక్ బాల్ టెస్ట్‌పై భారత బోర్డు ఆసక్తి చూపడం లేదని, ఇది 4 లేదా 5 రోజులకు బదులుగా 2 నుంచి 3 రోజుల్లో ముగుస్తుందని చెప్పుకొచ్చారు. పింక్ బాల్ టెస్టును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీసీసీఐ అన్ని విధాలా కృషి చేసిందని జైషా అన్నారు.

ఇప్పటివరకు గులాబీ బంతితో ఆడిన టెస్టులన్నీ కేవలం 2-3 రోజుల్లోనే ముగిశాయి. ప్రజలు 4 నుంచి 5 రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. కానీ, అది త్వరగా ముగుస్తుంది. దీంతో భారత్‌లో దీన్ని నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పింక్ బాల్ టెస్ట్ చివరిగా ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఆ తర్వాత మరే ఇతర దేశం దీనికి ఆతిథ్యం ఇవ్వలేదు.

టీమ్ ఇండియా ఇప్పటివరకు 4 పింక్ బాల్ టెస్టులు ఆడగా, 3 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో భారత్ చివరి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది కూడా 3 రోజుల్లో ముగిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు 2021లో ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు ఒకే ఒక్క పింక్ బాల్ టెస్టు ఆడింది. క్వీన్స్‌లాండ్‌లో జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది.

బీసీసీఐ సెక్రటరీ చేసిన ఈ ప్రకటన తర్వాత టీమ్‌ఇండియా పింక్‌ బాల్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడడం అనుమానంగా మారింది. ప్రస్తుతం భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. అక్కడ డిసెంబర్ 26 నుంచి 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్టులు ఎర్ర బంతితో నిర్వహించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..