క్లీన్ బౌల్డ్.. క్రీజు వీడిన బ్యాటర్.. సంబురాల్లో బౌలర్.. కట్‌చేస్తే.. నాట్ ఔట్ ఇచ్చిన అంపైర్.. కారణం తెలిస్తే షాకే?
మెల్‌బోర్న్ క్లబ్ క్రికెట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్యాటర్ క్లీన్ బౌలింగ్ చేశాడు. అంతే ఆ బంతి నో బాల్ కానేకాదు. అయినా, బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో ఎవరికీ ఏం అర్థం కాలేదు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ మిడిల్ స్టంప్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. బాల్ చాలా అద్భుతంగా ఉంది. అయితే, ఆ బాల్ మిడిల్ స్టంప్‌ను తాకింది. దీంతో మిడిల్ వికెట్ పడిపోయింది. అయితే, ఇక్కడే ఉంది అసలు విషయం. మిడిల్ వికెట్ పడిపోయింది.
Viral News: ఫాస్ట్ బౌలర్ విసిరిన అద్భుతమైన బాల్‌కు మిడిల్ స్టంప్ కిందపడింది. బ్యాట్స్‌మెన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది గమనించిన బ్యాటర్ కూడా ఔట్ అని భావించి, ఫీల్డ్ వదిలి వెళ్లబోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే అంపైర్ నాటౌట్ అని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇలాంటి వింత నిర్ణయానికి ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ సాక్షిగా నిలిచింది.
మెల్‌బోర్న్ క్లబ్ క్రికెట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్యాటర్ క్లీన్ బౌలింగ్ చేశాడు. అంతే ఆ బంతి నో బాల్ కానేకాదు. అయినా, బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో ఎవరికీ ఏం అర్థం కాలేదు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక్కడ మిడిల్ స్టంప్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. బాల్ చాలా అద్భుతంగా ఉంది. అయితే, ఆ బాల్ మిడిల్ స్టంప్‌ను తాకింది. దీంతో మిడిల్ వికెట్ పడిపోయింది. అయితే, ఇక్కడే ఉంది అసలు విషయం. మిడిల్ వికెట్ పడిపోయింది. కానీ, స్టంప్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ మేరకే ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం, బౌల్డ్ అవుట్‌గా నిర్ణయించబడాలంటే బంతులు స్టంప్స్‌ను కింద పడేయాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో మిడిల్ స్టంప్ కింద పడినా.. బెయిల్స్ మాత్రం ఎగరలేదు. దీంతో ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు బౌల్డ్ చేసిన నాటౌట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Given not out. Incredible 😂
via South Yarra CC pic.twitter.com/B3KY2K5XQg
— That’s So Village (@ThatsSoVillage) December 10, 2023
ప్రపంచకప్‌లో బేల్స్ వివాదం..
అంతకుముందు, 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో, జింగ్ బేల్స్ చాలా చర్చనీయాంశమైంది. ఐసీసీ అందించిన లైటింగ్ బేల్స్ బౌల్డ్ అయినప్పటికీ పడకపోవడమే సర్వత్రా ఆగ్రహానికి కారణంగా నిలిచింది.
ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్‌లో బౌల్డ్ అయినప్పటికీ, బెయిల్స్ పడకపోవడంతో ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ నాటౌట్‌గా నిలిచారు. దీనిపై పుకార్లు వచ్చాయి. దీని తర్వాత, బేల్స్ రూపకల్పనపై ఐసీసీ మరింత దృష్టి సారించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..