IND vs ENG: తొలి మ్యాచ్‌కి ముందే టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్.. ఇకపై అవి కుదరవన్న బీసీసీఐ..

BCCI New Policy: పీటీఐ నివేదిక ప్రకారం, బీసీసీఐ తన కొత్త 10-పాయింట్ పాలసీని ఇండియా-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ మ్యాచ్‌లు ఆడాల్సిన అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌లకు పంపింది. తొలి మ్యాచ్ కోల్‌కతాలో జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో CAB కూడా ఆ విధానాలను అమలు చేయడం ప్రారంభించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లకు తొలి షాక్ అందినట్లైంది.

IND vs ENG: తొలి మ్యాచ్‌కి ముందే టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్.. ఇకపై అవి కుదరవన్న బీసీసీఐ..
Ind Vs Eng

Updated on: Jan 20, 2025 | 2:07 PM

CAB Enforces BCCI New Policy: టీమ్ ఇండియా కోసం బీసీసీఐ ఇటీవల రూపొందించిన 10 పాయింట్ల విధానాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అంటే CAB అమలు చేసింది. పీటీఐ నివేదిక ప్రకారం, బీసీసీఐ తాను రూపొందించిన కొత్త విధానాలను భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ మ్యాచ్‌లు జరుగుతున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు పంపింది. దీంతో కొత్త విధానలు అమలు చేసే పని కూడా ప్రారంభమైంది. CAB దానిని ప్రారంభించింది. ఇక్కడ జనవరి 22 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. బీసీసీఐ రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం అసోసియేషన్ తరపున పని ప్రారంభించినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ధృవీకరించారు.

ఏ ఆటగాడికి స్పెషల్ కార్ ఉండదు – CAB అధ్యక్షుడు

బీసీసీఐ 10 పాయింట్ల విధానం ప్రకారం, CAB ఏ ఆటగాడికి ప్రత్యేక వాహనాన్ని అందించబోదని స్నేహాశిష్ గంగూలీ తెలిపారు. భారత జట్టు కోసం టీమ్ బస్సును ఏర్పాటు చేయనున్నట్టు పీటీఐకి తెలిపారు. అంతే కాకుండా వారికి ఎలాంటి ప్రయివేటు వాహనం అందించదు.

ఆటగాళ్లందరూ టీమ్ బస్సులోనే ప్రయాణించాలి – గంగూలీ

CAB ప్రెసిడెంట్ మాట్లాడుతూ, బీసీసీఐ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఆటగాళ్లందరూ జట్టుతో పాటు ప్రయాణిస్తారని స్పష్టంగా పేర్కొన్నారు. జట్టు నుంచి ఏ ఆటగాడు విడిపోలేడు. బీసీసీఐ రూపొందించిన 10 పాయింట్ల విధానంలో ఆటగాళ్లందరూ మ్యాచ్‌లు లేదా ప్రాక్టీస్ సెషన్‌లకు టీమ్ బస్సులో మాత్రమే వెళతారని తెలిపారు.

బీసీసీఐ కొత్త పాలసీలో టీమ్ బస్‌లో ప్రయాణించడమే కాకుండా.. కుటుంబానికి సంబంధించి, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సంబంధించిన పలు నిబంధనలను ఆటగాళ్లకు సరికొత్త రీతిలో రూపొందించారు. విధానం రూపొందించిన తర్వాత, ఇది భారత జట్టు ఆడుతున్న మొదటి సిరీస్. ఇందులో మొదటి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో, CAB ఆ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్ర క్రికెట్ సంఘంగా అవతరించింది.

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..

జనవరి 22న కోల్‌కతాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా, రెండో మ్యాచ్ జనవరి 25న చెన్నైలో జరగనుంది. ఇక మూడో, చివరి టీ20 జనవరి 28న రాజ్‌కోట్‌లో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..