DPL 2025 : డీపీఎల్ లో రచ్చ రచ్చ.. నితీష్ రాణా-దిగ్వేష్ రాఠీలకు జరిమానా.. అసలేం జరిగింది?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో వాగ్వాదం తర్వాత నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీపై భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన శుక్రవారం వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో జరిగింది. మైదానంలో ఒకరికొకరు సైగలు చేసుకున్నందుకు, వారి ఇద్దరిపై జరిమానా విధించారు.

DPL 2025 : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో వాగ్వాదం తర్వాత నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలకు భారీ జరిమానా విధించారు. ఈ సంఘటన శుక్రవారం జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ మధ్య జరిగింది. నితీష్ రాణా, దిగ్వేష్ రాఠీలు ఇద్దరూ మైదానంలో గొడవ పడడం, ఒకరికొకరు సైగలు చేసుకోవడం వల్ల వారిపై జరిమానా విధించారు.
నితీష్ రాణాకు భారీ ఫైన్
మ్యాచ్ తర్వాత డీపీఎల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. నితీష్ రాణాతో గొడవ కారణంగా దిగ్వేష్ రాఠీకి 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. ఎనిమిదో ఓవర్‌లో నితీష్ రాణా దిగ్వేష్ వేసిన బంతులకు వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
It’s all happening here! 🔥🏏
Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/OfDZQGhOlr
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025
నితీష్ రాణా రివర్స్ స్వీప్ చేసి సిక్స్ కొట్టిన తర్వాత వాతావరణం మరింత హీటెక్కింది. దిగ్వేష్ రాఠీ ఇలా ఇబ్బందుల్లో పడటం ఇది మొదటిసారి కాదు. అంతకు ముందు ఐపీఎల్ 2025లో కూడా అతనికి మూడుసార్లు జరిమానా విధించారు. డీపీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. ఆర్టికల్ 2.2 కింద క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠీపై 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించినట్లు పేర్కొంది. అదేవిధంగా, నితీష్ రాణాకు ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినందుకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు.
నితీష్ రాణా విధ్వంసం
నితీష్ రాణా ఎలిమినేటర్ మ్యాచ్‌లో 55 బంతుల్లో 134 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు 7 వికెట్ల విజయాన్ని అందించాడు. ఈ విజయంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్ క్వాలిఫైయర్ 2లో స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 30న ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 31న సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరుగుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




