ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త వికెట్ కీపర్ ఎవరో తెలుసా..? అతడి చెత్త రికార్డ్స్ తెలిస్తే షాక్ అవుతారు..

Ken James Worst Keeper Batsman : ఆడమ్ గిల్‌క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోని, కుమార సంగక్కర, మార్క్ బౌచర్ క్రికెట్ ప్రపంచంలో ఇంకా చాలా మంది

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త వికెట్ కీపర్ ఎవరో తెలుసా..? అతడి చెత్త రికార్డ్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Ken James Worst Keeper Bats
Follow us
uppula Raju

|

Updated on: Mar 12, 2021 | 5:41 PM

Ken James Worst Keeper Batsman : ఆడమ్ గిల్‌క్రిస్ట్, మహేంద్ర సింగ్ ధోని, కుమార సంగక్కర, మార్క్ బౌచర్ క్రికెట్ ప్రపంచంలో ఇంకా చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు, వారు తమ బ్యాటింగ్ తో భిన్నమైన గుర్తింపును పొందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప సగటుతో బ్యాటింగ్ చేసి తమ పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ఇదిలా ఉంటే.. తన బ్యాటింగ్‌తో అందరిని ఇబ్బందిపెట్టిన క్రికెటర్ గురించి మీరు విన్నారా.. గణాంకాల ప్రకారం చూస్తే క్రికెట్ ప్రపంచంలో అత్యంత చెత్త వికెట్ కీపర్ న్యూజిలాండ్‌కి చెందిన కెన్ జేమ్స్. ఇతడి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఈ రోజు అతడి పుట్టినరోజు.

వాస్తవానికి, కెన్ జేమ్స్ 10, జనవరి 1930 న న్యూజిలాండ్ తరఫున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ను 31 మార్చి 1933న ముగించాడు. ఈ కాలంలో జేమ్స్ న్యూజిలాండ్ తరఫున 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 13 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈ 11 టెస్టుల్లో అతను 11 క్యాచ్‌లు మరియు 5 స్టంప్‌లను వికెట్ కీపర్‌గా తీసుకున్నాడు, బ్యాట్స్‌మన్‌గా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.

కెన్ జేమ్స్ 11 టెస్టుల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. సగటున 4.72 చొప్పున పరుగులు చేశాడు. క్రికెట్ చరిత్రలో 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఇంత తక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కెన్ జేమ్స్. అంతేకాకుండా జేమ్స్ అదనంగా 205 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇందులో 22.19 సగటుతో 6413 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెన్ జేమ్స్ 311 క్యాచ్‌లు సాధించగా, 112 స్టంప్‌లు తీసుకున్నారు. దాదాపు ప్రతి క్రికెట్‌లోనూ వికెట్ కీపర్లు తమ బ్యాటింగ్‌తో జట్టుకు అవసరమైన పరుగులు చేసి బాసటగా నిలుస్తారు. కానీ ఈ విషయంలో కేన్ ఆటతీరు చాలా షాకింగ్‌గా ఉంది. జేమ్స్ జీవితంలో మరో కోణం ఉంది. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ న్యూజిలాండ్ వైమానిక దళానికి కూడా పనిచేశాడు.

మరిన్ని చదవండి..

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండు నెలలకు మైదానంలో అడుగుపెట్టిన టీం ఇండియా ఆల్‌రౌండర్..

18 నెలల బాలుడి గర్భంలో పిండం.. గర్భిణి స్త్రీ మాదిరి పెరుగుతున్న పొట్ట.. మహారాష్ట్రలోని పూణెలో విచిత్ర ఘటన..